Current Affairs

భారతరత్న పురస్కారాలు | Bharatha Ratna Awards

భారతరత్న పురస్కారాలు


భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారం భారతరత్న.ఈ అవార్డుని 1954 సంవత్సరంలో ప్రారంభించారు.
ఈ అవార్డును జనవరి 26(గణతంత్రదినము)న ప్రధానం చేస్తారు.
ఈ అవార్డును కళలు,శాస్త్ర సాంకేతిక రంగం,ప్రజాసేవ,ప్రభుత్వ సేవా రంగాలలో కృషి చేసిన వ్యక్తులకు ప్రధానం చేస్తారు.

భారతరత్న అవార్డును 1977 సంవత్సరంలో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రద్దు చేసారు.
ఈ అవార్డును తిరిగి 1980 సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం పునఃప్రారంభించింది.
ఈ అవార్డును సంవత్సరానికి గరిష్టంగా ముగ్గురికి ఇవ్వడం జరుగుతుంది.ఈ అవార్డును ఇప్పటి వరకు 45 మందికి ప్రధానం చేసారు.
ఇప్పటి వరకు 5 గురు మహిళలకు భారతరత్న అవార్డు లభించింది.
2011 లో భారతరత్న పరిధిని క్రీదారంగంతో సహా అన్ని రంగాలకు విస్తరించింది.
భారతరత్న,పద్మ అవార్డులు రాజ్యాంగంలో 18 వ అధికరణలో వివరించబడ్డాయి.
భారతరత్న అవార్డుల ఎంపిక కమిటీకి చైర్మన్ – ఉపరాష్ట్రపతి

ముఖ్యాంశాలు :
  • భారతరత్న అవార్డు పొందిన మొట్ట మొదటి వ్యక్తీ – సి.రాజగోపాలాచారి(రాజాజీ).
  • భారతరత్న అవార్డు పొందిన మొట్ట మొదటి మహిళ – శ్రీమతి ఇందిరాగాంధీ.
  • భారతరత్న అవార్డును మరణానంతరం పొందిన మొట్ట మొదటి వ్యక్తీ – లాల్ బహదూర్ శాస్త్రి.
  • భారతరత్న అవార్డును మరణానంతరం పొందిన మొట్ట మొదటి మహిళ – అరుణా అసఫ్ అలీ.
  • భారతరత్న అవార్డు పొందిన మొట్ట మొదటి విదేశీయుడు – ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్.
  • భారతరత్న పొందిన మొట్ట మొదటి క్రీడాకారుడు – సచిన్ టెండూల్కర్(2013).
  • భారతరత్న పొందిన పిన్న వయస్కుడు – సచిన్ టెండూల్కర్(40 సంవత్సరాలకు).
  • భారతరత్న పొందిన మొదటి రాష్ట్రపతి – బాబు రాజేంద్రప్రసాద్(1961).
  • భారతరత్న పొందిన మొదటి ఉపరాష్ట్రపతి – ఎస్.రాధాకృష్ణన్(1954).
  • భారతరత్న పొందిన మొదటి ప్రధాని – జవహర్ లాల్ నెహ్రు(1955).
  • భారతరత్న పొందిన మొదటి మరియు ఏకైక సినిమా నటుడు – ఎం.జి.ఆర్(1988).
  • భారతరత్న పొందిన మొదటి సినిమా దర్శకుడు – సత్యజిత్ రే(1992).
  • భారతరత్న పొందిన మొదటి సంగీత వేత్త – ఎం.ఎస్.సుబ్బలక్ష్మి(1998).
  • 100 వ పుట్టిన రోజున భారతరత్న పొందినది – డి.కె.కార్వే(సంఘ సంస్కర్త)1958.
  • భారతరత్న పొందిన మొదటి శాస్త్రవేత్త – సి.వి.రామన్(1954)


భారతరత్న పొందిన శాస్త్రవేత్తలు ముగ్గురు :
సి.వి.రామన్(1954)
ఎ.పి.జె అబ్దుల్ కలాం(1997)
సి.ఎన్.ఆర్.రావు(2013)

భారతరత్న ,నోబెల్ రెండు అవార్డులు పొందిన భారతీయులు :
సి.వి.రామన్(1954)
మథర్ థెరిస్సా(1980)
అమర్త్యసేన్(1998)

భారతరత్న,ఆస్కార్ రెండూ పొందినది :సత్యజిత్ రే
1.సి.రాజగోపాలా చారి ___=>  1954
2.సర్వేపల్లి రాధాకృష్ణన్  ___=>   1954
3.సి.వి.రామన్ ___=>    1954
4.జవహర్ లాల్ నెహ్రు ___=>    1955
5.భగవాన్ దాస్ ___=>    1955
6.మోక్షగుండం విశ్వేశ్వరయ్య ___=>    1955
7.గోవింద్ వల్లభ్ పంత్ ___=>    1958
8.డి.కె కార్వే ___=>    1958
9.బి.సి రాయ్ ___=>    1961
10.పురుషోత్తమ దాస్ టాండన్ ___=>    1961
11.బాబూ రాజేంద్రప్రసాద్ ___=>    1961
12.జాకీర్ హుస్సేన్ ___=>    1963
13.సి.వి. కానే ___=>    1963
14.లాల్ బహుదూర్ శాస్త్రి ___=>    1966
15.శ్రీమతి ఇందిరాగాంధీ ___=>    1971
16.వి.వి.గిరి ___=>    1975
17.కె.కామరాజ్ నాడార్ ___=>    1976
18.మధర్ థెరిస్సా ___=>    1980
19.ఆచార్య వినోభా బావే ___=>    1983
20.ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ___=>    1987
21.యం.జి.రామచంద్రన్ ___=>    1988
22.బి.ఆర్.అంబేద్కర్ ___=>    1990
23.నెల్సన్ మండేలా ___=>    1990
24.రాజీవ్ గాంధీ ___=>    1991
25.సర్దార్ వల్లభాయ్ పటేల్ ___=>    1991
26.మొరార్జీ దేశాయ్ ___=>    1991
27.జె.ఆర్.డి.టాటా ___=>    1992
28.మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ___=>    1992
29.సత్యజిత్ రే ___=>    1992
30.గులార్జీలాల్ నందా ___=>    1997
31.అరుణా అసఫ్ అలీ ___=>    1997
32.ఎ.పి.జె.అబ్దుల్ కలాం ___=>    1997
33.M.S.సుబ్బలక్ష్మి ___=>    1998
34.సి.సుబ్రహ్మణ్యం ___=>    1998
35.జయప్రకాష్ నారాయణ ___=>    1998
36.ఆమర్త్యసేన్ ___=>    1998
37.పండిత్ రవిశంకర్ ___=>    1999
38.గోపీనాథ్ బార్దోలియా ___=>   1999
39.బిస్మిల్లాఖాన్ ___=>    2001
40.లతా మంగేష్కర్ ___=>    2001
41.పండిత్ భూమ్ సేన్ జోషి ___=>    2008
42.చింతామణి నాగేశ రామచంద్రరావు ___=>    2013
43.సచిన్ రమేష్ టెండూల్కర్ ___=>    2013
44.మదన్ మోహన్ మాలవీయ ___=>   2014
45.అటల్ బిహారీ వాజపేయి ___=>   2014

భారతరత్న మెడల్ వివరాలు :
భారతరత్న మెడల్ రావి పత్రము ఆకారంలో ఉండి కంచు పూత కలిగి ఉంటుంది.
మెడల్ కి ఒక వైపు ప్రకాశిస్తున్న సూర్యుని బొమ్మ ,దేవనాగరి లిపిలో భారతరత్న అని వ్రాయబడి ఉంటుంది.
మెడల్ కి రెండవ వైపు భారత జాతీయ చిహ్నం, దేవనాగరి లిపిలో వ్రాయబడిన సత్యమేవజయతే అనే సూక్తి ఉంటుంది.
గమనిక : 1992 లో సుభాష్ చంద్రబోస్ కు భారతరత్న ఇవ్వడం జరిగింది.కాని అది తిరస్కరించడమైనది.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!