Current Affairs

Kadapa Sri Vijaya Durga Devi Temple Programs – Shailaputri Alankaaram at 02-10-2016 (Sunday)

02-10-2016 ఆదివారం  (శుద్ధ విదియ)

శైలపుత్రి  అలంకారము 


దుర్గా దేవి ప్రథమ స్వరూరంలో శైలపుత్రి నామంతో ప్రఖ్యాతి చెందినది. పూర్వ జన్మలో ఈమె దక్షప్రజాపతి పుత్రికయైన సతీదేవి. ఈమెకు శంకరునితో వివాహమైనది . ఒకానొక సమయంలో దక్షుడు మహాయజ్ఞం ఆచరించెను. యజ్ఞభాగములను స్వీకరించుటకు దేవతలందరినీ  ఆహ్వానించి , పరమేశ్వరుని అనేక విధాలుగా ఒప్పించి ఒక్కసారి తండ్రి చేయు యజ్ఞమును, తన అక్కచెల్లళ్ళను చూచి వస్తానని వెళ్ళింది. అక్కడ శంకరుని పట్ల అంతటా తిరస్కారభావాలు గోచరించగా అవమానాన్ని సహించలేక యోగాగ్నిలో తన దేహం భస్మం చేసుకుంది. మరుజన్మలో పర్వతరాజైన హిమవంతుని పుత్రికగా జన్మించడంతో ఆమెకు శైలపుత్రీ దేవికి పూజలు, ఉపాసనలు జరుపబడును. ఈమె యొక్క మహిమలు, శక్తులు అనంతములు. మొదటి దినముల యోగులు ఉపాసన ద్వారా టప  మూలాధారచక్రమున స్థిరపరచుదురు. దీనితోనే వారి యోగసాధన ఆరంభమవును. 

శ్రీ విజయ దుర్గా దేవి ఆలయానికి ప్రక్కనే ఉన్న గొప్ప మండపంలో ఈ విదియ రోజు అమ్మవారు శైలపుత్రిగా అలంకరింపబడి దర్శనం ఇస్తుంది.


02-10-2016 ఆదివారం (శుద్ధ విదియ) రోజు కడప కనకదుర్గాదేవి ఆలయం లో జరుగు కార్యక్రమాలు :

  • తెల్లవారుజాము 4. 30 నిమిషాలకు  :  షోడశ (16 ) కలశములతో విశేష అభిషేకము  
  • సాయంత్రం 3. 30                          :  చతుషష్టి ఉపచార పూజ 
  • సాయంత్రం 6. 00                          :   “శైలపుత్రి దేవి”  అలంకారము 
  • రాత్రి 8. 00                                   :    ఆలయ ప్రదక్షిణ   

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!