Current Affairs

Kadapa Sri Vijaya Durga Devi Temple Programs – Brahmacharini Devi Alankaaram at 03-10-2016 (Monday)

03-10-2016 సోమవారం  (శుద్ధ విదియ)
బ్రహ్మాచారిణీ దేవి  అలంకారము


దుర్గామాత యొక్క నవశక్తులలో రెండవది “బ్రహ్మచారిణి” స్వరూపము ఇచ్చట “బ్రహ్మ” అనగా తపస్సు, “బ్రహ్మచారిణి” అనగా తపమాచరించునది. బ్రహ్మచారిణీదేవి స్వరూపము పూర్తిగా జ్యోతిర్మయము. మిక్కిలి శుభంకరము ఈ దేవి కుడిచేతియందు జపమాలను, ఎడమ చేతియందు కమండలమును ధరించును. హిమవంతుని కూతురైన పార్వతియే ఈ బ్రహ్మచారిణీదేవి. ఈమె పరమేశ్వరుని పతిగా బడయుటకు నారదుని ఉపదేశమును అనుసరించి, ఘోరతపమాచరించెను. ఈ కఠిన తపచర్య కారణమునే ఈమెకు బ్రహ్మచారిణి అనే పేరు స్థిరపడెను. దుర్గామాత యొక్క ఈ రెండవ స్వరూపము భక్తులను, సిద్దులకును అనంత ఫలప్రదము. ఈమెను ఉపాసించుటచే మానవులలో తపస్సు, త్యాగము, వైరాగ్యము, సదాచారము , సంయమనం వృద్ధి చెందును. దుర్గా నవరాత్రి పూజలలో రెండవ రోజున ఈమె స్వరూపమే ఉపాసించబడును. ఈ దినమున సాధకుని మనస్సు స్వాధిష్ఠాన చక్రము నందు స్థిరమగును. – ఈ చక్రము నందు స్థిరమైన మనస్సు గల భక్తుడు ఈమె కృపకు పాత్రుడగును. అతనికి ఈమె యెడల భక్తి ప్రవత్తులు దృఢమగును.

  • శ్రీ విజయ దుర్గా దేవి ఆలయానికి ప్రక్కనే ఉన్న గొప్ప మండపంలో ఈ విదియ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి దేవి గా అలంకరింపబడి దర్శనం ఇస్తుంది.

03-10-2016 సోమవారం  (శుద్ధ విదియ) రోజు కడప కనకదుర్గాదేవి ఆలయం లో జరుగు కార్యక్రమాలు :


  • తెల్లవారుజాము 4. 30 నిమిషాలకు  :  అష్టాదశ  (18 ) కలశములతో విశేష అభిషేకము  
  • సాయంత్రం 3. 30                          :   మహాలింగార్చన  
  • సాయంత్రం 6. 00                          :   “బ్రహ్మచారిణీ దేవి ”  అలంకారము 
  • రాత్రి 8. 00                                   :    ఆలయ ప్రదక్షిణ  
 

    About the author

    Mallikarjuna

    Leave a Comment

    error: Content is protected !!