Current Affairs

Kadapa Sri Vijaya Durga Devi Temple Programs – Chandraghanta Devi Alankaaram at 04-10-2016 (Tuesday)

04-10-2016  మంగళవారము  (శుద్ధ తదియ)
చంద్రఘంట దేవి  అలంకారము

దుర్గామాత యొక్క మూడవ శక్తి నామము “చంద్రఘంట” . నవరాత్రోత్సవములలో మూడవ రోజున ఈమె విగ్రహమునకే పూజా పురస్కారములు జరుగును. ఈ స్వరూపమే  శాంతిప్రదము, కళ్యాణకారకము. ఈమె తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెకు “చంద్రఘంట” అను పేరు స్థిరపడెను. ఈమె శరీర కాంతి బంగారమువలె మిలమిలలాడుచుండును. ఈమె తన పది చేతులలో ఖడ్గము మొదలగు శాస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించియుండును. నవరాత్రి పూజలయందు మూడవరోజు సేవ మిక్కిలి మహిమోపేతమైనది. ఈ దినమున సాధకుని మనస్సు మణిపూరక చక్రమును ప్రవేశించును. చంద్రఘంటామాట కృపవలన సాధకుని సమస్తపాపములు, బాధలు తొలగిపోవును. చంద్రఘంటాదేవిని భజించెడివారు, ఉపాసించెడివారు ఎక్కడికి వెళ్ళినాను వారిని దర్శించిన వారందరు సుఖశాంతులను పొందెదరు. 

  • శ్రీ విజయ దుర్గా దేవి ఆలయానికి ప్రక్కనే ఉన్న గొప్ప మండపంలో ఈ రోజు అమ్మవారు  చంద్రఘంట దేవిగా  అలంకరింపబడి దర్శనం ఇస్తుంది.

04-10-2016 మంగళవారము  (శుద్ధ తదియ) రోజు కడప కనకదుర్గాదేవి ఆలయం లో జరుగు కార్యక్రమాలు :


  • తెల్లవారుజాము 4. 30 నిమిషాలకు  :  పంచవింశతి  (25 ) కలశములతో విశేష అభిషేకము  
  • సాయంత్రం 2. 30 to 4.30               :   రాహుకాల పూజ  
  • సాయంత్రం 4. 00                          :    అన్నపూర్ణాదేవి 
  • రాత్రి 6. 00                                   :    చంద్రఘంట దేవి ”  అలంకారము
  • రాత్రి  8. 00                                  :    ఆలయ ప్రదక్షిణ 

    About the author

    Mallikarjuna

    Leave a Comment

    error: Content is protected !!