Meeku Telusa

మనం చేసే ఈ చిన్న చిన్న తప్పులే కిడ్నీలు చెడిపోవడానికి కారణాలు || kidney problems in telugu

మనిషి శరీరంలో కిడ్నీలు అత్యంత ప్రముఖపాత్ర పోషిస్తాయి. చిక్కుడు గింజ ఆకారంలో ఉండే మూత్ర పిండాలు శరీరంలోని హానికారక వ్యర్థాలను బయటకు పంపేయటంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపుతాయి. మనం ఆరోగ్యంగా జీవించాలంటే కిడ్నీలు మెరుగ్గా పనిచేయడం ఎంతో అవసరం.

అయితే ప్రపంవ్యాప్తంగా కిడ్నీ సమస్యలతో బాధపడేవారు నానాటికీ పెరుగుతూనే ఉన్నారు. ముఖ్యంగా మనదేశంలో.. ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. కిడ్నీలు వాటంతట అవే ఎప్పడూ పాడుకావు.. మన ఆహారపు అలవాట్లు, జీవన వ్యవహారాల వల్లే అవి చెడిపోవడానికి దారితీస్తాయి. మరి కిడ్నీలను ఇబ్బంది పెడుతున్న ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..!

శరీరానికి నీరు చాలా అవసరం. నీరు సరిగా తాగకపోవడం వల్ల బాడీ డీహైడ్రేషన్ కి గురవుతుంది. దీంతో అంతర్గతంగా ఉండే మలినాలను వడపోయటానికి సరిపడా నీరు లేక కిడ్నీలు త్వరగా చెడిపోతాయి. కనుక శరీరానికి తగినన్ని ద్రవాలు తీసుకోవాలి. అధిక ఒత్తిడికి గురవడం కూడా కిడ్నీలు పాడవడానికి ఒక కారణం. కనుక వీలైనంతవరకూ ఒత్తిడికి దూరంగా ఉండి కిడ్నీలు బాగా పనిచేసేలా చూసుకోండి.

కొంతమంది ఏదైనా పనిమీద బయటకు వెళ్లినప్పుడు మూత్రాన్ని చాలా సేపటి వరకు ఆపుకుంటారు. గంటలకొద్దీ మూత్రాన్ని అలాగే ఆపుకునేవారు కూడా ఉన్నారు. ఇలా చేయడం వల్ల కిడ్నిలో రాళ్లు ఏర్పడే పరిస్థితితో పాటు కిడ్నీ పూర్తిగా చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. కొంతమంది త్వరగా బరువు తగ్గేందుకు ప్రోటీన్ షేక్‌లను అతిగా తీసుకుంటున్నారు. దీనివల్ల శరీరానికైతే ప్రోటీన్లు అందుతున్నాయి. కానీ, మనకు తెలియకుండానే అవి కిడ్నీలపై దుష్ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి బరువు తగ్గడంలో తొందరపాటు తగదు.

తెలుసుకున్నారు కదా! నిత్యం మనం చేసే ఈ చిన్న చిన్న తప్పులే కిడ్నీలు చెడిపోవటానికి కారణాలుగా ఎలా మారాయో! మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో షేర్ చేసుకోండి. 

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!