ఫోన్ కాల్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు | Elon Musk Autobiography in Telugu

మనం ఎప్పుడు పనులను ఇంకెంత బాగా చేయాలనీ ఆలోచిస్తూ ఉండాలి, మనల్ని మనం ప్రశ్నించుకుంటూనే ఉండాలి.

నేటి తరం సంభ్రమాశ్చర్యాలతో ఆరాధనగా చూసే వ్యక్తి ఎలాన్ మస్క్. శాస్త్రవేత్త, ఆవిష్కర్త, ఎసాహసిక వ్యాపారవేత్త.. ఇలా ఆయన గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. గంటకు 1,200 కి.మీ. వేగంతో ప్రయాణించే ‘హైపర్ లూప్’ ఆవిష్కారం నుంచి మనిషిని అంగారకుడి మీదకు పంపి అంతరిక్ష విప్లవం సృష్టించే వరకూ.. మస్క్ చేతిలో ఉన్న భారీ ప్రణాళికల జాబితా చూస్తే మనం బిత్తరపోవాల్సిందే. ఒక వైపు టెస్లా, మరోవైపు స్పేస్-ఎక్స్ వంటి దిగ్గజ కంపెనీలతో బిజీగా ఉన్నా మస్క్ రోజూ కచ్చితంగా 6 గంటలు నిద్రపోతారు! “నిద్ర తగ్గిన రోజున.. నేనెన్ని గంటలు ఎక్కువ పనిచేసినా.. పని ఎప్పటి కంటే తక్కువే అవుతోంది. అందుకే రోజూ రాత్రి 1కి నిద్రపోయి ఉదయం 1కు లేస్తా” అంటారాయన. క్షణం ఖాళీ లేకుండా రోజు మొత్తాన్ని ఐదేసి నిమిషాల బ్లాకుల్లా విభజించుకుని వారం మొత్తమ్మీద 85-100 గంటలు పని చేయటం మస్క్ ప్రత్యేకత. ఇందులో 80% సమయం ఇంజినీరింగ్, డిజైన్ మీదే గడుపుతారు.


 సోమ-గురువారాలు స్పేస్ ఎక్స్ కు; మంగళ, బుధవారాలు టెస్లాకు, శుక్రవారం రెండు కార్యాలయాలకు వెళతారు. వారంలో అర పూట ఓపెన్ ఏఐ’ అనే లాభాపేక్ష లేని కృత్రిమ మేధ సంస్థ కోసం పని చేస్తారు. ఎంత పని ఉన్నా- శనివారాలు తన ఐదుగురు కుమారులతో, ఆదివారం ప్రయాణాలు చేస్తూ గడుపుతారు. వారంలో రెండుసార్లు ట్రెడ్ మిల్, బరువులు ఎత్తటంతో సహా చాలా వ్యాయామాలు చేస్తారు. రోజూ షవర్ కింద స్నానం తప్పనిసరి, తన జీవితం మీద అతి పెద్ద సానుకూల ప్రభావం చూపే అలవాటు ఇదేనంటారు. ఫోన్ కాల్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అనవసర మెయిల్స్ నుంచి తప్పించుకునేందుకు తన మెయిల్ ఐడీ కూడా బయట ఎవరికీ చెప్పరు. ఆహారం మాత్రం 5 నిమిషాల్లో ముగిస్తారు, అదీ మీటింగుల మధ్యే. పుస్తకాలు, ముఖ్యంగా ఆత్మకథలను చదవటం మానరు.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now
Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!