Current Affairs

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2019 | AP Agriculture Budget 2019


రానున్న 2019 – 2020 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ శుక్రవారం 12/07/2019 న శాసనసభలో ప్రవేశ పెట్టారు. 28,866.23 కోట్ల ఈ బడ్జెట్ లో రెవెన్యూ వ్యయం క్రింద 27,946.65 కోట్లు ఉండగా పెట్టుబడి వ్యయం క్రింద 919.58 కోట్లు, రైతు పెట్టుబడి సాయం క్రింద 8750 కోట్లను కేటాయించారు. రైతు భరోసా కింద ఒక్కో రైతు కుటుంబానికి ఏటా రూ.12,500 సాయం చేయనున్నారు

ఏపీ వ్యవసాయ బడ్జెట్ – హైలెట్స్ 

➥ రూ.28,866 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ 
➥ రైతుల పెట్టబడి సాయం -రూ.8,750 కోట్లు అక్టోబర్ నుంచి పెట్టుబడి సాయం అందజేత
➥ 81 వేల హెక్టార్లలో ఉద్యాన వన పంటల సాగు లక్ష్యం 
➥ రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటుకు ప్రణాళిక 
➥ పులివెందులలో అరటి పరిశోధన కేంద్ర0, ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు 
➥ ఈ ఏడాది 12 ఈనాం మార్కెట్ల ఏర్పాటు 
➥ నిషేధ సమయంలో మత్స్యకారుల భృతి రూ.10వేలకు పెంపు 
➥ ఆ వేటకు వెళ్లి మత్స్యకారులు చనిపోతే కుటుంబానికి రూ. 10 లక్షలు
➥ 10 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న గిడ్డంగుల నిర్మాణం 
➥ 100 రైతు బజారులు ఏర్పాటు 
➥ 50 వేల సోలార్ పంపు సెట్లు ఏర్పాటు 

బడ్జెట్ లో కేటాయింపుల వివరాలు 

➩   వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి-రూ.1163 కోట్లు 
➩   వైఎస్సార్ రైతు బీమాకు-రూ.100 కోట్లు 
➩   ప్రమాదవశాత్తు రైతు చనిపోతే-రూ.7 లక్షలు 
➩   ధరల స్థిరీకరణ నిధికి-రూ.3వేల కోట్లు 
➩   విపత్తు నిర్వహణ నిధి-రూ.2002 కోట్లు 
➩   జాతీయ ఆహార భద్రత మిషన్-రూ.141 కోట్లు 
➩   వ్యవసాయ యాంత్రీకరణకు-రూ.420 కోట్లు 
➩   భూసార పరీక్ష నిర్వహణకు-రూ.30 కోట్లు 
➩   ఆ పొలం పిలుస్తుంది, పొలం బడికి-రూ.89 కోట్లు
➩   వ్యవసాయ మౌలిక వసతలకు-రూ.349 కోట్లు 
➩   రైతులకు రాయితీ విత్తనాలకు-రూ.200 కోట్లు 
➩   జీరో బడ్జెట్ వ్యవసాయానికి-రూ.91 కోట్లు 
➩   ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి -రూ.29 కోట్లు 
➩   పట్టు పరిశ్రమ అభివృద్ధికి -రూ.158 కోట్లు 
➩   ఉద్యాన పంటల సమగ్ర అభివృద్ధికి-రూ.200 కోట్లు 
➩   బిందు, తుంపర సేద్య పరికరాలకు-రూ.1105 కోట్లు 
➩   పశుసంవర్ధక శాఖకు-రూ.1778 కోట్లు
➩   పశు టీకాల కోసం-రూ.25 కోట్లు 
➩   పశువు మరణిస్తే బీమా పథకం కింది-రూ.30వేలు 
➩   గొర్రె మరణిస్తే గొర్రెల బీమా పథకం కింద-రూ.6వేలు 
➩   కోళ్ల పరిశ్రమల నిర్వాహకుల రుణాల కోసం-రూ.50 కోట్లు 
➩   పాడిపరిశ్రమకు-రూ.100 కోట్లు ఆ పశుగ్రాసం కోసం-రూ.100 కోట్లు 
➩   మత్స్యశాఖ అభివృద్ధికి రూ.550 కోట్లు 
➩   జువ్వలదిన్నె, ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నంలలో.. ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటు కోసం-రూ.1758 కోట్లు 
➩   వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు- రూ.3223 కోట్లు 
➩   వ్యవసాయ సహకార రంగానికి-రూ.234 కోట్లు 
➩   రైతులకు ఉచిత విద్యుత్ కోసం-రూ.4525 కోట్లు 

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!