Self Employment

కొంచెం కొత్తగా ఆలోచించండి నెలకు 50,000 వరకు సంపాదన Home Automation Business

టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు స్మార్ట్ హోమ్స్‌కు డిమాండ్ ఏర్పడుతోంది. సినిమాల్లో మాదిరిగానే ఇప్పుడు జనాలు కూడా వారి ఇంట్లో ఆటోమేటిక్ టెక్నాలజీ కోరుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌తో ఇంట్లోని వస్తువులను ఆపరేట్ చేయాలని భావిస్తున్నారు. కూర్చున్న చోటు నుంచే ఫ్యాన్ ఆన్ చేయడం, బల్బు ఆఫ్ చేయడం వంటివి కోరుకుంటున్నారు.    

భారత్‌ మార్కెట్‌లో హోమ్ ఆటోమేషన్ ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉంది. రానున్న రోజుల్లో హోమ్ ఆటోమేషన్‌కు ఫుల్ డిమాండ్ ఉండొచ్చనే నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో కంపెనీలు కూడా ఈ విభాగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. హోమ్ ఆటోమేషన్ బిజినెస్‌ను సొంతంగా ప్రారంభించడం కుదరకపోతే.. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న కంపెనీల నుంచి డీలర్‌షిప్ తీసుకోవచ్చు. ఇంకొంచెం డబ్బులు పెట్టుకుంటే డిస్ట్రిబ్యూషన్‌షిప్ కూడా పొందొచ్చు. పొంగొహోమ్ అనేది ఒక స్టార్టప్. ఇది హోమ్ ఆటోమేషన్ రంగంలో సేవలు అందిస్తోంది. తక్కువ ఇన్వెస్ట్మెంట్‌తో ఈ స్టార్ట‌ప్‌లో భాగస్వాములం అయ్యి మంచి రాబడి పొందొచ్చు.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!