Life Style

ఇంట్లోనే గుమగుమలాడే గులాబ్ జామ్ చేస్కోండిలా..

ఆదివారం ఇంట్లో అందరితో కలిసి నోరు తీపి చేసుకోవాలని అందరూ అనుకుంటుంటారు. ఇంట్లో వండే పదార్థాలు అయితే ఇంకా బాగుంటాయనుకుంటారు. అతి తక్కువ సమయంలో అత్యంత రుచితో ఇంటిళ్లిపాది చేసుకు తినే స్వీట్ ఏదైనా ఉందంటే అదే.. గులాబ్ జామ్. ఇంట్లో అత్యంత రుచికరంగా గులాబ్ జామ్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం..

కావలసిన పదార్దములు

గులాబ్ జామ్ పేకెట్ : ఒకటి (200g)

పంచదార : అర కేజీ (500గ్రా)

యాలుకలపొడి : అర టీ స్పూన్

నూనె : పావుకేజీ

తయారీ విధానం

గులాబ్ జామ్ పెకిట్ కట్ చేసి ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్ళుపోసి కలపాలి.

ఒక పది నిముషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరో పాత్ర పెట్టి నూనె వేడి చెయ్యాలి.

పక్క స్టవ్ కూడా వెలిగించి, వేరే గిన్నెలో పంచదార వేసి కొద్దిగా నీళ్ళు కలిపి స్టవ్ మీద పెట్టి లేత పాకం పట్టాలి.

కలిపిన పిండిని తీసుకోని చిన్నచిన్న ఉండలుగా చేసి, కాగే నూనెలో చిన్న మంట మీద దోరగా వేగనివ్వాలి.

అలా వేగిన ఉండల్నితీసి పాకంలో వెయ్యాలి. పది నిముషాలు అలాగే ఉంచితే పాకం పీల్చుకొని గులాబ్ జాంలు తినటానికి రెడీగా ఉంటాయి.

రుచికరమైన గులాబ్ జామ్ తయారీకి పిండి కలిపేటప్పుడు అందులో కాస్త పన్నీర్ కలిపితే జామ్ లు మృదువుగా ఉంటాయి. అలాగే పిండిని కలిపే సమయంలో జీడిపప్పులను పొడిగా కొట్టి కలిపితే రుచితో పాటు వెరైటీగా ఉంటాయి.

  • ఇలా మీరు కూడా కొత్త వంటకాలు చేయడం ఇంట్లో ప్రయత్నిస్తుంటారా.. అయితే క్రింది కామెంట్ బాక్సులో వాటి గురించి తెలుపండి.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!