Self Employment

Business Ideas | ఏఏసి బ్రిక్ మేకింగ్ బిజినెస్ తో ఊహించని ఆదాయం

నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న దేశం మనది. అందువలన ఈ రంగంలో బిజినెస్ చేస్తున్న వారికి ఎన్నో లాభాలు వస్తాయని చెప్పవచ్చు. అయితే ఇటీవల కాలంలో మారుతున్న టెక్నాలజీతో పాటు నిర్మాణ రంగంలో కూడా ఎన్నో ఆవిష్కరణలు వస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చిన ఏఏసీ బ్రిక్ టెక్నాలజీ ఎంతో విజయవంతమైన టెక్నాలజీగా పేరు తెచ్చుకుంది. ఇక ఈ బిజినెస్ కు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకుందాం.
ఈ బిజినెస్ ప్రారంభించడానికి మనకి మిక్సింగ్ మిషన్ కావాల్సి ఉంటుంది, దీని ధర మనకు 20 వేల రూపాయల వరకు ఉంటుంది. దీనితో పాటు కటింగ్ మెషిన్ కావాలి, దీని ధర 2 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అంతేకాకుండా ఆటో క్లెవ్ మెషిన్ కావాలి, దీని ధర 5 లక్షల రూపాయల వరకు ఉంటుంది. మనం తీసుకునే మిషన్ రకాన్ని బట్టి మిషన్ ధరలు అనేది ఆధారపడి ఉంటాయి. ఇక తయారీ విధానాన్ని మనం మిషన్ సప్లయర్స్ దగ్గర గాని ఇప్పటికే ఈ బిజినెస్ ను నడుపుతున్న వారి దగ్గర నుంచి గాని నేర్చుకోవచ్చు.
అంతే కాకుండా మనకు నలుగురు వర్కర్స్ తో పాటు కొంచెం స్థలం మరియు షెడ్ కావాల్సి ఉంటుంది. ఇలా ఈ వ్యాపారం ప్రారంభించడానికి మనకి మొత్తం 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అయితే మనం పెట్టుబడి ఖర్చులు గురించి దిగులు చెందనఅవసరం లేదు. ఎందుకంటే మనకి కొన్ని గవర్నమెంట్ సబ్సిడీ లోన్లు లభిస్తాయి. ప్రస్తుతం నిర్మాణ రంగం వేగంగా దూసుకుపోతుండడంతో ఇలాంటి ప్రొడక్ట్స్ కు ఎంతో డిమాండ్ ఉంది.
అలానే మార్కెటింగ్ కూడా దీనికి ఎంతో అవసరం. మార్కెటింగ్ కొరకు మనం లోకల్ గా ఉన్న కాంట్రాక్టర్స్ తో లేదా కన్స్ట్రక్షన్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఏఏసీ బ్లాక్ ల వల్ల ఉపయోగాలు అధికంగా ఉండడంతో కన్స్ట్రక్షన్ రంగం వారు వీటిని కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. కాబట్టి మార్కెటింగ్ చేయడం కూడా కొంతమేర సులభతరం అవ్వచ్చు. ఈ బిజినెస్ లో లాభాలు భారీగా ఉంటాయనే చెప్పాలి. మనం చేసే మార్కెటింగ్ మీద ఆధారపడి మనం నెలకు లక్ష రూపాయల లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం మార్కెటింగ్ పరిధిని పెంచుకుంటూ పోతే ఆ లాభాలు ఇంకా పెరుగుతాయి

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!