Self Employment

Business Ideas | Kwality Walls Ice Cream Shop | క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్ ఫ్రాంచైజీ బిజినెస్

సాధారణంగా ఫ్రాంచైజీ బిజినెస్లు అనేవి రిస్క్ కలిగి ఉండవు. వీటికి చాలా సేఫ్ బిజినెస్ లుగా పేరుంది. కాబట్టి మనం ఫ్రాంచైజీ బిజినెస్ ప్రారంభించడం రిస్క్ రహితం మరియు చాలా లాభదాయకం కూడా. సహజంగా క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్స్ బిజినెస్ ను మూడు రకాలుగా చేయొచ్చు. అయితే ఈరోజు మాత్రం ప్రాథమికమైన బేసిక్ యూనిట్ గురించి వివరించబోతున్నాం.ఈ బేసిక్ క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్ ఫ్రాంచైజీ బిజినెస్ ను ప్రారంభించడానికి మనకి మూడు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మొత్తం ఈ అమౌంట్ లోనే మనకు షాప్ ఫర్నీచర్, ఫ్రీజర్స్ వస్తాయి. అయితే బ్యాక్ అప్ జనేరేటర్, షాపు అడ్వాన్సు కు మనం మరో లక్ష రూపాయలు ఖర్చు అదనంగా అవుతుంది. ప్రతి నెల కరెంట్ ఖర్చులు, షాపు అద్దె ఖర్చులు, వర్కర్స్ పేమెంట్ అదనం. గవర్నమెంట్ లైసెన్స్ అనేది మనం ఫ్రాంచైజీ తీసుకోవడం ద్వారా సులభంగా వస్తుంది.

ఇక ఈ బిజినెస్ లో లాభాలను ఒకసారి చూద్దాం. క్వాలిటీ వాల్స్ లో మనకు వివిధ రేంజిలలో ఐస్ క్రీమ్స్ అనేవి ఉంటాయి. మనం యావరేజ్ న ఐస్ క్రీమ్ మీద 50 రూపాయలు వేసుకున్న రోజుకి 100 ఐస్ క్రీమ్స్ సేల్ మిద మనం 5000 రూపాయలను సంపాదించవచ్చు. వీటిలో మనం ఖర్చులు 3000 రూపాయలు పక్కన పెట్టినా నెలకి సులువుగా 50 నుండి 60 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు. అయితే మనం ఇలా ఎక్కువ మొత్తంలో సంపాదించాలంటే దానికి మన పట్టణ జనాభా, మనం ఏ ప్రాంతంలో షాపును ప్రారంభిస్తున్నాం ఇలా పలు రకాల విషయాలు కారణమవుతాయి. పైన చెప్పిన లాభాలు, ఖర్చులు ఒక అంచనతో చెప్పబడినవి మాత్రమే, ఒకసారి బిజినెస్ లోకి దిగాక లాభాలు, ఖర్చుల వివరాలలో హెచ్చుతగ్గుల ఉండవచ్చు.

క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్స్ ప్రముఖమైన బ్రాండ్ కాబట్టి మనం ఐస్ క్రీమ్ పార్లర్ ను ప్రారంభిస్తే ఆటోమేటిక్ గా అందరికీ తెలుస్తుంది. అయితే ఆరంభంలో హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం, సిటీ కేబుల్స్ లో యాడ్స్ ఇవ్వడం ద్వారా మౌత్ పబ్లిసిటీ అనేది సులభంగా అయిపోతుంది.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!