Self Employment

Business Ideas Telugu || Slippers Making Business | మంచి డిమాండ్ ఉన్న ఒక చిన్న బిజినెస్ ఐడియా

హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మంచి డిమాండ్ ఉన్న ఒక చిన్న బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం, అదే పాదరక్షల తయారీ బిజినెస్, ప్రస్తుతం స్లిప్పర్స్ కి ఎంత డిమాండ్ ఉందొ మనందరికీ తెలిసిందే పాద రక్షలలో చాల రకాలు, వెరైటీలు ఉంటాయి, అయితే మనం ఈ రోజు  హవాయి చెప్పుల తయారీ బిజినెస్ గురించి తెలుసుకుందాం.  ఈ రోజుల్లో మినిమమ్ 100 రూపాయలకు హవాయి చెప్పులు దొరుకుతున్నాయి. ఇది కూడా హవాయి చెప్పులకు సంబందించిన బిజినెస్ ఈజీగా మీరు రిటైల్ అవుట్ లెట్ ద్వారా సెల్ చేసుకోవచ్చు. మంచి లాభాలు కూడా వస్తాయి , ఓపిక ఉండాలి, ఎక్కువ షాపులకు తిరిగి వీటిని సెల్ చేసుకోవాలి.

ఈ బిజినెస్  స్టార్ట్ చేయాలి అంటే కనీసం 2 లక్షలైనా ఉండాలి అని అందరు అనుకుంటూ ఉంటారు కానీ కేవలం 25 వేల రూపాయల లోపే ఈ హవాయి చెప్పుల తయారీ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు.

ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి స్లిప్పర్ మేకింగ్ మెషిన్ అవసరం అవుతుంది. ఈ మిషన్ కేవలం 7000 ధరకే లభిస్తుంది, దీంతో పాటు మీకు స్లిప్పర్స్ అంచులను గ్రైండింగ్ చేయడానికి గ్రైండింగ్ మిషన్ మరియు స్లిప్పర్స్ కి హోల్ వేసుకోవడానికి డ్రిల్లింగ్ మెషిన్ మరియు స్లిప్పర్స్ కి స్ట్రాప్స్  తగిలించడానికి ఫిట్టింగ్ మెషిన్ కావాలి.  ఈ మిషన్ లతో పాటు స్లిప్పర్స్ తయారు చేయడానికి డైస్ అవసరం అవుతాయి. ఒక్కో డై మార్కెట్ లో కేవలం 500 రూపాయల నుండి లభిస్తుంది. ఈ డైస్ వివిధ సైజులలో అవసరం అవుతాయి. ఉదాహరణకు 6,7,8,910 ఇంచుల స్లిప్పర్స్ తయారు చేయడానికి ఆ సైజుల యొక్క డైస్ అవసరం అవుతాయి.

ఇక ఈ బిజినెస్ కు రా మెటీరియల్ గా రబ్బర్ షీట్స్ అవసరం అవుతాయి. ఈ రబ్బర్ షీట్స్ 200 నుండి 250 రూపాయల వరకు ఉంటాయి ఇందులో మల్టి కలర్ అయితే ఇంకొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది. ఒక రబ్బర్ షీట్ తో 8 జతల చెప్పులను తయారు చేయవచ్చు. సైజులను బట్టి పెరగవచ్చు తగ్గవచ్చు. తరువాత రా మెటీరియల్ వచ్చేసి స్ట్రాప్స్, ఈ స్ట్రాప్స్ ఒక్కొక్కటి 10 నుండి 15 రూపాయల వరకు ఉంటుంది.  వీటిని కూడా మీరు తయారు చేసే స్లిప్పర్ యొక్క సైజును బట్టి తీసుకోవలసి ఉంటుంది.

ఈ స్లిప్పర్స్ తయారీ అనేది చాల సులభం మీరు ఏ సైజ్ స్లిప్పర్స్ తయారు చేయాలనుకుంటున్నారో ఆ సైజ్ డై తీసుకుని రబ్బర్ పైన ఉంచి మిషన్ ప్రెస్ చేస్తే ఆ సైజ్ కి రబ్బర్ అనేది కట్ అవుతుంది, కట్ అయిన పీసుల అంచులను గ్రైండింగ్ మెషిన్ తో గ్రైండింగ్ చేసుకుని ఆ రబ్బర్ షీట్ కి డ్రిల్లింగ్ మిషన్ తో హొల్స్ వేసి స్ట్రాప్స్ ఫిట్టింగ్ చేయాలి అనే స్లిప్పర్స్ రెడీ అవుతాయి.

ఈ బిజినెస్ కి మార్కెటింగ్ విషయానికి వస్తే ఏ బిజినెస్ లో అయినా మీరు ట్రెండ్ ఫాలో అవ్వకూడదు మీరే ఒక కొత్త ట్రెండ్ ని సెట్ చేయాలి వీటిని నీట్ గా బాక్స్ లలో పెడితే ఎవరు కొనరు. వీటికి  బ్రాండ్ ఏమి అవసరం లేదు ఒక కవర్ లో పెట్టి మీ ప్రాంతంలో రద్దీగా ఉన్న ఏరియాలో కుప్పలుగా పోస్తే చాలు జనం వింతగా వీటిని చూడటానికి వచ్చి కొనుక్కుంటారు.

ఈ బిజినెస్ లో ఖర్చులు లాభాల వివరాలు ఒక సరి చూసుకుంటే ఒక రబ్బర్ షీట్ తో మీరు 8 జతల స్లిప్పర్స్ తయారు చేయవచ్చు. సైజులను బట్టి పెరగవచ్చు తగ్గవచ్చు. యావరేజ్ గా ఒక జత స్లిప్పర్స్ కోసం 13 రూపాయాల రబ్బర్ షీట్ అవసరం,, ఇంకా స్ట్రాప్స్ 12 రూపాయలు, అంటే ఒక జత స్లిప్పర్స్ తయారీ ఖర్చు యావరేజ్ గ 25 రూపాయలు అవుతుంది మీరు షాపులకు వేయాలి అంటే ప్యాకింగ్ బాక్స్ లు కావాలి సో తయారీ ఖర్చు 35 అవుతుంది మీరు  ఒక జత పైన 35 రూపాయలు లాభం వేసుకుని 70 రూపాయలకు షాపులకు హోల్ సెల్ గా వేసుకోవచ్చు. లేదా ముందు చెప్పిన విధంగా రద్దీగా ఉన్న ఏరియాలో వీటిని డిఫరెంట్ గా మార్కెటింగ్ చేసుకోవచ్చు.

slipper Grinding Machine :   https://www.indiamart.com/proddetail/slipper-sole-grinder-machine-20768248033.html

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!