Chepa Mandu Prasadam || చేప మందు ప్రసాదం కథ ఏంటి ఎలా తయారు చేస్తున్నారు బత్తిన బ్రదర్స్ మాత్రమే ఎందుకు

Chepa mandu story telugu

హైదరాబాద్ లో బత్తిన బ్రదర్స్ 2023 జూన్ 9 న చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. అసలు ఈ చేప ప్రసాదం పంపిణీ ఎలా ప్రారంభమైంది ఈ చేప ప్రసాదం పైన వచ్చిన విమర్శలు ఏంటి..అసలు ఈ చేప ప్రసాదాన్ని ఎలా తయారు చేస్తారు.. ఇప్పుడు తెలుసుకుందాం

పాతబస్తీ ధూల్ బౌల్ కి చెందిన బత్తిని వీరన్న గౌడ్ బేగంబజార్ లో కల్లు దుకాణం నిర్వహించేవారు 1847లో ఒకరోజు వర్షంలో తడిసిన ఒక సాధువు ను చూశాడు. వీరన్న గౌడ్ అతని తన ఇంటికి తీసుకెళ్ళాడు వీరన్న గౌడ్ చేసిన సపర్యలకు సంతృప్తిచెందిన సాధువు ఆస్తమా వ్యాధిని నయంచేసే వనమూలికల గురించి చెప్పాడు ప్రతి సంవత్సరం మృగశిర కార్తి రోజు ఎలాంటి లాభాపేక్ష లేకుండా రోగులకు ఉచితంగా పంపిణీ చేస్తే నీకు నీ కుటుంబానికి మేలు జరుగుతుందని ఆ సాధువు వీరన్న గౌడ్ కు చెప్పాడు. ఇక అప్పటి నుండి వీరన్న గౌడ్ ప్రతి సంవత్సరం మృగశిర కార్తి ముందురోజు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు తర్వాత తన కుటుంబసభ్యులు కూడా ఆ ఆచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు ఈ చేప ప్రసాదం లో పాల పిండి ఇంగువ బెల్లం పసుపు తో పాటు కొన్ని సహజసిద్ధమైన వనమూలికలు మాత్రమే వాడతారు

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

కొన్ని సహజ సిద్ధమైన వనమూలికలు వాడతారు ఈ ప్రసాదం తయారీలో భాగంగా మాత్రమే వాడతారు పంపిణీకి 24 గంటల ముందు నుంచి ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఈ చేప ప్రసాదం పంపిణీ కోసం కొర్రమీను చేప పిల్లలు మాత్రమే వినియోగిస్తారు

ప్రాణంతో ఉన్న చాప పిల్ల నోట్లో వనమూలికల తో తయారు చేసిన మిశ్రమం పెట్టి ఆస్తమా బాధితుల గొంతులో నుంచి కడుపులోకి పంపిస్తారు

అయితే ఈ చేప ప్రసాదం శాస్త్రీయత పై అనేక వివాదాలు ఉన్నాయి దీనికి అసలు శాస్త్రీయత లేదని కొన్ని సంస్థలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీన్ని చేప మందు గా కాకుండా చేప ప్రసాదంగా పిలవాలని కోర్టు తీర్పునిచ్చింది. చేప ప్రసాదం తయారీ పంపిణీ అంతా పరిశుభ్రమైన వాతావరణంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో జరగాలని ఆదేశాలిచ్చింది

అయితే ఈ చేప ప్రసాదం కోసం ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుంచి దాదాపు 4 లక్షల మంది రోగులు హైదరాబాద్ కు వస్తారు. కరోనా వల్ల గత మూడేళ్లుగా నిలిచిపోయిన చేప ప్రసాదం పంపిణీ ఈ సంవత్సరం మళ్లీ ప్రారంభించనున్నారు

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండిటెలిగ్రామ్ గ్రూప్ లింక్
Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!