కౌండిన్య లవ్ స్టోరీ: పరాయి దేశానికి మొట్టమొదటి భారత రాజు

మన భారత వారిపై పరదేశీయులు దండయాత్రలు చేసి మనల్ని పరిపాలించారు అని తెలుసు. కానీ మన భారతీయులు ఎలాంటి దండయాత్రలు చేయకుండానే దక్షిణ ఆసియా దేశాలను శాశించారు. మీరు నమ్మకపోయినా ఇది నిజం.

ఇప్పుడు మనం కంబోడియా గా పిలుచుకునే కాంభోజ దేశానికి మొదటి రాజు మన భారతీయుడు. ఇక్కడ వ్యాపార నిమిత్తం పడవలో బయల్దేరిన అతను కంబోడియాలో పూనాన్ రాజ్యాన్ని స్థాపించాడు. అతడి పేరు “కౌండిన్య“. మన భారతదేశంలో కళింగ దేశానికి చెందిన ఈ కౌండిన్య, మన భారతీయ సంస్కృతి దక్షిణాసియాలో విస్తరించడానికి ప్రధమ కారకుడయ్యాడు.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

కౌండిన్య “కళింగ రాజ్యం” అంటే ఇప్పుడు ఒడిస్సా ప్రాంతానికి చెందిన వాడు. ఆ కాలంలో కళింగ వాణిజ్య కేంద్రంగా ఉండేది. సముద్రయానం చేస్తూ వ్యాపారాలు సాగించే వారిని “సాదబ” అని పిలిచేవారు. నిజానికి కౌండిన్య అనేది అతని పేరు కాదు, బ్రాహ్మణుల వర్గంలో ఒకటి ఈకౌండిన్య. కానీ చరిత్రలో అతను కౌండిన్యగా గుర్తింపు పొందాడు.

తరచూ సముద్ర ప్రయాణాలు చేస్తూ వివిధ ప్రాంతాల్లో వ్యాపారాలు సాగిస్తూ ఉండే ఈ కౌండిన్య, ఓసారి దక్షిణ భారతదేశంలోని తీర ప్రాంతాలు పర్యటించి ఆపై శ్రీలంక నుంచి గల్ఫ్ అఫ్ థాయ్ ల్యాండ్ దిశగా ప్రయాణించాడు. అతని ఓడ నిండా బంగారం, వజ్రాభరణాలు, ఖరీదైన బట్టలు సహా వివిధ రకాల వస్తువులు వెంట తెచ్చుకున్నాడు. అప్పట్లో భారత్ నుంచి తెచ్చే సరుకులకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉండేది. అందుకే భారత్ నుంచి వచ్చే పడవలపై సముద్రపు దొంగలు దాడి చేసి సరుకులను దోచుకునేవాళ్ళు.

కౌండిన్య విషయంలోనూ ఇదే జరిగింది. ఓడ నిండా విలువైన వస్తువులతో ప్రయాణిస్తున్న కౌండిన్య బృందంపై సముద్రపు దొంగలు దాడి చేశారు. అయితే కౌండిన్య వర్గం వారిని ఎదిరించి దీటుగా పోరాడింది. దొంగల బెడద నుంచి అయితే వాళ్లు తప్పించుకున్నారు గానీ, ఈ పోరాటంలో ఓడ బాగా ద్వంసం అయిపోయింది. సముద్రంలో మునిగి పోయే ప్రమాదం ఉండడంతో క్షణమే దానికి మరమ్మతులు చేయాలని ఉద్దేశంతో కౌండిన్య ఓడను సమీపంలోని ఓ తీరానికి చేర్చాడు. ప్రమాదం నుంచి బయటపడ్డామని తేరుకునేలోపే, కౌండిన్య బృందాన్ని కొందరు మనుషులు చుట్టుముట్టారు.

వీళ్ళు ఎవరో కాదు, అంతకు ముందు కౌండిన్య బృందం పై దాడి చేసి పారిపోయిన సముద్రపు దొంగలు. మరోసారి పోరుకు కౌండిన్య బృందం సిద్ధమవుతుండగా, శత్రుసేన నాయకుడు చేసిన ప్రతిపాదనకు అంతా అవాక్కయ్యారు. తన కుమార్తె “సోమ”ను కౌండిన్య వివాహం చేసుకోవాలని అతను ప్రపోజల్ పెట్టాడు. సోమ సూచన మేరకే తండ్రి ఈ ప్రతిపాదన చేశాడు. తమతో జరిగిన పోరాటంలో కౌండిన్య చూపిన ధైర్యసాహసాలకు “సోమ” ఫిదా అయిపోయిందట. నాగ అని పేర్కొనే తెగకు ఈ సోమ ఒక చిన్న తీర ప్రాంతాన్ని పరిపాలించేది.

ఇక పెళ్ళి ప్రతిపాదన విషయానికి వస్తే, ఏం ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడో తెలియదు కానీ కౌండిన్య పెళ్ళికి ఒప్పుకున్నాడు. కౌండిన్య, సోమ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అలా వీరిద్దరూ కలిసి పూనాన్ రాజ్యాన్ని స్థాపించారు. ఈ రాజ్యానికి రాజు అయిన కౌండిన్య, వ్యధపుర అనే రాజధానిగా పరిపాలన సాగించాడు. భారత దేశం సహా దక్షిణాసియా దేశాల లోని పలు ప్రాంతాల్లో వ్యాపార వర్గాల్లో మంచి పేరు సంపాదించుకున్న కౌండిన్య, తన పలుకుబడిని ఉపయోగించి వ్యాపారులతో పూనాన్ రాజ్యాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే కాక రాజ్యాన్ని కూడా విస్తరించాడు.

అలా పూనాన్ సహా దక్షిణాసియా దేశాల్లో భారత్ నుంచి రాకపోకలు పెరగడంతో, ఈ ప్రాంతాలకు కూడా భారతీయ సంస్కృతి విస్తరించింది. ఇక కౌండిన్య ను సోమ వివాహం చేసుకోవడం వెనుక చరిత్రకారులు మరో ఆసక్తికర కారణం చెప్పుకొచ్చారు. సోము కు చెందిన పూనాన్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే స్థానిక తెగల నాయకులకు పరిపాలన ఆ కాలంలో తలనొప్పిగా మారిపోయిందట. జనాభా విపరీతంగా పెరగడం, అవసరాలు పెరగడం మొదలైన కారణాలతో ఆ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలో తేలిసేది కాదట. ఇక అప్పటికి భారత్ ఇలాంటి సమస్యలన్నింటినీ ఎదుర్కొని సరైన వ్యవస్థను ఏర్పరుచుకుంది. అందుకే తమ పరిష్కారానికి భారతీయులే కరెక్ట్ అని భావించారట.

సోమా ప్లాన్ కూడా అదే… దానికి తోడు కౌండిన్య పోరాడే సామర్థ్యం కూడా ఉండడంతో సోమ అతన్ని వివాహం చేసుకోవాలని ఫిక్స్ అయింది. ఇక ఆ తర్వాత ఇండోనేషియా వంటి మిగతా దీవులలో కూడా భారతీయులకు ప్రాధాన్యం పెరిగింది. అక్కడ ఉన్నత కుటుంబాలతో సంబంధాలు కలుపుకోవడం ద్వారా, చాలా మంది భారతీయులు ఆ దేశాల్లో ఉన్నత పదవుల్లో సాగారని , ఆ రాజ్యాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని చరిత్రకారులు చెబుతుంటారు.

Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!