Business Idea: ఒక్కసారి పెట్టుబడితో నెలకు లక్ష సంపాదన బిజినెస్ నచ్చితే ఓ లుక్కేయండి

వ్యాపారం పైన మంచి అవగాహన ఉండి, డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే అధిక రాబడి వచ్చే వ్యాపారాలు చాలా ఉన్నాయి. మీరు మంచి లాభం కోసం మీ స్వంత, చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటూ ఉంటె పేపర్ స్ట్రా తయారీ బిజినెస్ ని ఎంచుకోవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా మీరు ప్రతి నెలా లక్షల రూపాయలు వరకు సంపాదించవచ్చు. 

ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 1 జూలై 2022 నుండి ప్లాస్టిక్ స్ట్రాస్‌తో పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం పైన నిషేధం విధించడంతో పేపర్ తో తయారు చేసిన వస్తువులకు డిమాండ్ బాగా పెరిగింది. ఆలాంటి వస్తువులలో ఒకటి పేపర్ స్త్రా… రోడ్డుమీద కొబ్బరిబొండాలు అమ్మే బండి దగ్గర నుంచి స్టార్ హోటల్స్ వరకు అనేక చోట్ల ఈ పేపర్ స్ట్రా లను ఉపయోగిస్తున్నారు. కాబట్టి పేపర్ స్ట్రాల తయారీ బిజినెస్ ప్రారంభిస్తే మంచి లాభాలు పొందొచ్చు.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

సో ఈ పేపర్ స్ట్రా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఆదాయం ఎంతవస్తుంది, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అవసరమైన ప్రభుత్వ అనుమతులు మరియు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ప్రభుత్వం నుండి ఏదైనా సహాయం అందుతుందా అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

RSS Error: A feed could not be found at `http://www.tejajobs.com/`. This does not appear to be a valid RSS or Atom feed.

ఈ పేపర్ స్ట్రాలు తయారుచేయడానికి పేపర్ స్ట్రా మేకింగ్ మిషన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధర మార్కెట్ లో సుమారుగా పదమూడు లక్షల వరకు ఉంటుంది దీంతో పాటు కటింగ్ మిషన్ కొనుగోలు చేయాలి. దీని ధర మార్కెట్లో దాపుగా యాభై వేల వరకు ఉంటుంది. ఈ స్ట్రా తయారీకి వుడ్ గ్రేడ్ గమ్ పౌడర్ వాటిని ప్యాక్ చేయడానికి ప్యాకేజీ మెటీరియల్ అవసరమవుతాయి

ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కాబట్టి ఈ వ్యాపారాన్ని ప్రారంభించటానికి ప్రధానమంత్రి ముద్ర లోన్ పథకం కింద కూడా మీరు లోన్ సదుపాయం పొందడానికి ట్రై చేసుకోవచ్చు.

వివరాల ప్రకారం.. పేపర్ స్ట్రా తయారీ వ్యాపారం ప్రాజెక్ట్ వ్యయం రూ.19.44 లక్షలు. ఇందులో మీరు రూ.1.94 లక్షలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తం రూ.13.5 లక్షల టర్మ్ లోన్ తీసుకోవచ్చు. అలాగే వర్కింగ్ క్యాపిటల్ కోసం రూ.4 లక్షలు ఫైనాన్స్ చేయవచ్చు. మొత్తం ప్రాసెస్‌లో భాగంగా మీ వ్యాపారం 5 నుండి 6 నెలల్లో ప్రారంభించుకోవచ్చు. వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు PM ముద్రా లోన్ పథకం కింద కూడా లోన్ తీసుకోవచ్చు.

ఈ పేపర్ స్ట్రాలు తయారు చేయడం ఎలా

ఈ పేపర్ స్ట్రాలు రకరకాల రంగులలో కూడా తయారు చేయవచ్చు మీకు కావాల్సిన రంగుని బట్టి వుడ్ గ్రేడ్ పేపర్ రోల్ కొనుగోలు చేయాలి తర్వాత వాటిని పేపర్ మేకింగ్ మెషిన్ లోని రోలర్ స్టాండ్ లో పెట్టాలి ఇప్పుడు పేపర్ స్ట్రా లోపల వ్యాసం 4.7 మిల్లీమీటర్ల నుంచి 20 మిల్లీమీటర్ల వరకు మీ అవసరాన్నిబట్టి చేసుకోవచ్చు. అంతే మీకు కావాల్సిన విధంగా పేపర్ స్ట్రాలు తయారు అయిపోతాయి. అయితే ఈ స్ట్రాలు మిషన్ లో నుండి బయటకు తీసినపుడు ఒకదానికి ఒకటి అతుక్కుపోయి ఉంటాయి తర్వాత వాటిని కటింగ్ చేయాల్సి వస్తుంది దీనికోసమే కటింగ్ మిషన్ కొనుగోలు చేయాలి.

అయితే ఈ వ్యాపారం ప్రారంభించే ముందు ప్రభుత్వం నుంచి అనుమతి, రిజిస్ట్రేషన్, జిఎస్టి రిజిస్ట్రేషన్ వ్యాపారం చేసే వ్యక్తి ఆధార్, బ్రాండ్ పేరు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుండి ట్రేడ్ మార్క్, NOC వంటి ప్రాథమిక అంశాలు ముందుగానే చూసుకోవాలి.

ఈ పేపర్ స్ట్రాలు మార్కెట్లో 5mm, 6mm,8mm,10 mm, 12 mm ఇలా వివిధ డయా మీటర్ లలో లభిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో ఒక పేపర్ స్ట్రా ప్యాకెట్ ధర 100 రూపాయల నుంచి మొదలవుతుంది. ఒక ప్యాకెట్ లో 100 స్ట్రాలు ఉంటాయి. అంటే ఒక స్ట్రా ఒక్క రూపాయి అన్న మాట. ఒక రోజుకి మన దగ్గర ఉన్న మిషనరీ తో 50 ప్యాకెట్లు తయారు చేసిన రోజుకు ఐదు వేల ఆదాయం ఉంటుంది అంటే నెలకు లక్షా 50 వేల రూపాయలు. ఇందులో ఖర్చులు, పన్నులు, కరెంట్ బిల్, షాపు రెంట్, జీతాలు వంటివాటిని సగం తీసేసిన 50 నుంచి 70 వేల రూపాయల లాభాన్ని పొందవచ్చు.

మార్కెటింగ్ ఎలా?

పేపర్ స్ట్రాలు ఎక్కువగా ఉపయోగించే వారితో అంటే జ్యూస్ సెంటర్, కూల్ డ్రింక్ కంపెనీస్, కొబ్బరి బొండాలు అమ్మే షాపుల వాళ్ళతో మాట్లాడుకుని ఒప్పందం చేసుకుంటే ఈ బిజినెస్ మరింత లాభదాయకంగా ఉంటుంది. సూపర్ మార్కెట్ హోల్సేల్ షాప్ లో కూడా మీ బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళతో టై అప్ అవ్వవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీకు కూడ ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచన ఉంటే ఇప్పుడే ఈ బిజినెస్ గురించి కొద్దిగా రీసెర్చ్ మొదలు పెట్టండి

A1 paper straw machine
Chennai
Tamil nadu India
Ph : +91 8921750661

Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!