అసుర అసుర రావణాసుర | రావణాసురుడు ఎవరు? ఆ పేరు ఎలా వచింది

అసురుల చక్రవర్తి అయిన రావణుడు అడుగు పెట్టాడంటే చుట్టూ ఉన్న చెట్లు కదలడం ఆపేస్తాయి. నదీజలాలు భయంతో తమ ప్రవాహ వేగాన్ని తగ్గించుకుంటాయి. ఈ లంకాధిపతి ని చూసి జడవని ప్రాణి లేదు. అందుకే సీతాపహరణ జరిగిన సమయంలో సీతమ్మ బాధతో చేసే ఆర్తనాదాలతో జాలికలిగిన మునులతో పాటు మిగిలిన జీవరాసులు రావణుడి అంతానికి బీజం పడిందని లోలోపల సంతోషించాయట…

రావణుడు నిజంగానే అంతటి పరాక్రమవంతుడా? అసలు రావణుడికి ఆ పేరు ఎలా వచ్చింది? దశకంఠుడు పాలించిన ఆ లంక ఎలా ఉండేది ఇప్పుడు తెలుసుకుందాం…

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

రావణుడు విశ్రవసు , కైకసి దంపతులకు జన్మించాడు. ఈ విశ్రవసుడు ఎవరో కాదు బ్రహ్మమానస పుత్రులలో ఒకరైన కులస్య మహా ముని కుమారుడు. నిజానికి రావణ అనేది అతని అసలు పేరు కాదు. మహాబలవంతుడు తపోశక్తి సంపన్నుడు అయిన దశగ్రీవుడు కుబేరుడుతో పోరాడి ఆయన పుష్పక విమానం సొంతం చేసుకున్న తరువాత అందులో విజయగర్వంతో విహరిస్తున్నాడు.

ఈ క్రమంలో ఆ పుష్పకవిమానం ఓ చోటుకు వచ్చి ఇక ముందుకు కదలడం ఆగిపోయింది. దశగ్రీవుడు ఎంత ప్రయత్నించినా అది ముందుకు కదల్లేదు. ఆ తర్వాత అది శివపార్వతులు ఉండే కైలాసం అని అతనికి తెలిసింది. దశగ్రీవుడు పరమ శివభక్తుడు అయినప్పటికీ ఆ క్షణం విజయ గర్వం అతని కళ్ళు కప్పేసింది. తన పుష్పక విమానానికి అడ్డుగా ఉన్న ఆ కైలాసాన్ని ఆ దశకంఠుడు ఎత్తేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో కైలాస పర్వతం కనిపించడంతో పరమశివుడికి తపోభంగం అయింది. వెంటనే పరమశివుడు దశగ్రీవుడుకి బుద్ధి చెప్పాలని తన బొటనవేలితో పర్వతాన్ని తొక్కి పెట్టడంతో ఆ అసురుల చక్రవర్తి దానికింద పడి నలిగిపోయాడు.

ఆ దెబ్బకు అతని గర్వం అణిగిపోయింది. ఆ క్షణంలో రావణుడు చేసిన ఆర్తనాదం, అరుపులు భీకరంగా ఉండడం తో అతడికి రావణ అని పేరు వచ్చింది. రావణ అంటే బిగ్గరగా అరిచి వాడు అని అర్థం వస్తుంది. ఇక ఆ సమయంలో పుట్టినదే శివ తాండవ స్తోత్రం. “జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే”, “కలెవవంలంభితంబుజంగతుంగమాలికాం”.

ఇలా రావణబ్రహ్మ పరమశివుణ్ణి కొలుస్తూ చేసిన స్తుతి ఇప్పటికీ స్మరించుకుంటూ ఉంటారు. రావణుడి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు చంద్రహాసం అనే ఖడ్గాన్ని బహూకరించాడు. కఠోర దీక్షతో బ్రహ్మ కృప పొందిన రావణుడు ఆ వరాలను దుర్వినియోగం చేసేవాడు. మనుషులతో పాటు దేవతలను కూడా హడలెత్తించే వాడు.

రావణుడి అకృత్యాలు చూసి యముడే సరైనవాడు అనుకున్న నారదముని మనుషులతో కాదు దేవతలతో పోరాడు ముఖ్యంగా యముడితో పోరాడి నీ పరాక్రమం ఏంటో నిరూపించు అని రావణుడిని నారదుడు రెచ్చగొట్టాడు. కానీ దశకంఠుడి దాటికి యముడే వణికి పోయి యుద్ధభూమి నుంచి పారిపోయాడు. అంతటి పరాక్రమవంతుడు రావణాసురుడు. అందుకే అరణ్యకాండలో సీతాపహరణ ఘట్టములో బ్రాహ్మణ రూపంలో సీత ఉన్న చోటుకు అడుగులు వేస్తున్న రావణుని చూసి చెట్టు చేమ వణికి పోయాయి. గోదావరి నది తన ప్రవాహాన్ని తగ్గించుకుంది అంత వణుకు రావణుడు అంటే ప్రతి ప్రాణికి. అందుకే సీతమ్మ జాడ ఎక్కడా అని ఆ పర్వతాలను రాముడు అడిగినా ఎవరూ సమాధానం చెప్పలేదు.

ఇంద్రుని అమరావతి నగరం కంటే అందంగా ఉంటుందని ఇంకా నగరంలోని భవనాలు అంతర్గత భాగాలు మిరుమిట్లుగొలిపే బంగారంతో నిర్మించబడి ఉన్నాయని, ప్రవేశ ద్వారాలకు వజ్రవైఢూర్యాలు ఉంటాయని ఇందుకు శ్వేతవర్ణ లోని ప్రకారాలు తోడై ఆ నగరం మధురంగా ఉంటుందని, ఏనుగులు గుర్రాలు రథాలతో సందడిగా ఉంటుందని, సృఖముల హోరుతో ప్రతిధ్వనిస్తుంది అని, అన్ని కాలాల్లోనూ ఫలాలు అందించే తోటల మధ్య ఆ ప్రదేశమంతా మనోహరంగా ఉండటమే కాక మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది అంటూ లంకా నగరం గురించి సీతకు మొదటి పరిచయం చేశాడు రావణుడు.

సీతను బలవంతంగా ఎత్తుకు వచ్చిన రావణుడు, ఆమెను మొదట కోటలోని ప్రత్యేక గదిలో బంధించి ఉంచుతాడు తన అనుమతి లేనిదే ఎవ్వరినీ లోపలికి వెళ్ళనివ్వడు. ఎవరు జానకి తో మాట్లాడటానికి వీల్లేదని పరిచారిక లను ఆదేశిస్తాడు. ఆ తర్వాత కోట బయటకు వచ్చి రామలక్ష్మణుల పై నిఘా పెట్టమని ఎనిమిది మంది రాక్షసులను పంపిస్తాడు. వీలు చిక్కినప్పుడల్లా వారిని చంపేందుకు ప్రయత్నించమని ఆదేశిస్తాడు
ఆ తర్వాత మళ్ళీ రావణుడికి సీతమ్మ మీద మనసు మళ్లడంతో ఆమె దగ్గరకు వస్తాడు. తన రాజభోగాలను చూపిస్తే సీత మనసు మారుతుంది అని భ్రమ పడ్డాడు. స్వర్ణ ఖచ్చితమైన నేలపై తిరుగుతూ రావణుడు తన వెంట వస్తూ దుఃఖంతో కుమిలిపోతున్న సీతమ్మకు మెట్ల బావులు, చెట్లు ఇలా పరిసరప్రాంతాలు చూపించ సాగాడు

రావణుడు అంతటితో ఆగలేదు ఓ సీత నా ఒక్కడికే వెయ్యి మంది పరిచారికలు ఉన్నారు. నాకు మహారాణి గా ఉంటే ఈ లంక అంతా నీ చెప్పుచేతల్లో ఉంటుంది. చుట్టూ సముద్రం తో నూరు యోజనాల విస్తీర్ణంలో ఉండే ఈ లంకలోకి ఇంద్రుడి వంటి దేవతలు కూడా అడుగు పెట్టలేదు. ఇలా ఎన్నో మాటలు చెప్పి సీత మనసు మార్చేందుకు ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోయింది. ఇంత చేసిన రావణుడికి కనీసం సీత బదులు కూడా ఇవ్వకపోవడంతో. ఆమెని అశోకవనాన్ని కి తరలించామని పరిచారిక లను ఆదేశిస్తాడు. అవును అసలు దేవతలని వణికించిన అంత పరాక్రమవంతుడు కదా రావణాసురుడు సీతమ్మను ఎందుకు అంతగా బ్రతిమిలాడుతున్నాడు అని సందేహం రావచ్చు ఇదే సందేహం రావణుడి సైన్యాధిపతులలో ఒకరు వ్యక్తపరుస్తాడు.

పరాక్రమవంతుడైన ఓ రావణ నువ్వు సీతను బలవంతంగా ఎందుకు అనుభవించ లేవు అని మహా పార్షుడు సలహా ఇస్తాడు. నీలో ఇంత కోరిక ఉన్నపుడు దాన్ని ఎందుకు అణచి పెట్టుకున్నావు, ఎందుకు భయపడుతున్నావు, నీకు అడ్డు వచ్చే వాడు ఎవడు, ఒకవేళ వచ్చినా మేమంతా కలిసి వాళ్ళని అణచివేయు అని చెప్పుకొచ్చాడు. అంతా విన్న రావణాసురుడు అసలు సీతను బలవంతం చేయకపోవడానికి కారణం ఏంటో అప్పుడు చెప్పాడు. ఓ మహా పార్శా కొంత కాలం క్రితం నేను బ్రహ్మదేవుని కలవడానికి వెళ్తున్నప్పుడు పుంజికస్థల అనే అప్సరస నా కంట పడింది. ఆమే అందానికి ముగ్ధుడైన నేను ఆమెను బలవంతంగా అనుభవించాను ఆమె వెళ్ళి విషయాన్ని బ్రహ్మ కు ఫిర్యాదు చేస్తుంది. కోపోద్రిక్తుడైన అయిన బ్రహ్మ ఇకపై ఏ స్త్రీని అయినా బలవంతంగా అనుభవిస్తే తల వెయ్యి ముక్కలు అవుతుంది అందులో సందేహమే లేదు అని శపించాడు నన్ను. ఆ భయంతోనే నేను అప్పటి నుంచి మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డ కుండా ఉంటున్నాను అని చెప్పుకొచ్చాడు. ఇది దశకంఠుడు అసురగణ చక్రవర్తి లంకాధిపతి రావణుడి కథ

Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!