Andhra Pradesh

Korean Age System 2023 | ఆదేశంలో ప్రజల వయస్సు ఒక సంవత్సరం వెనక్కి ఎందుకో తెలిస్తే ఆశ్చర్య పోతారు

సౌత్ కొరియా లో కొత్త ఏజ్ కౌంటింగ్ సిస్టం అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి అక్కడ కూడా వయసు లెక్కించడానికి అంతర్జాతీయ విధానాన్నే అనుసరిస్తున్నారు. 1965 నుంచి ఆసియా దేశాలు అన్ని అంతర్జాతీయ విధానంలోనే వయస్సు లెక్కిస్తున్నాయి. అంటే బిడ్డ పుట్టినప్పుడు అతని వయసు సున్నాగా పరిగణించి పన్నెండు నెలలు గడిచాక ఏడాది అని లెక్కిస్తున్నారు.

కానీ దక్షిణ కొరియాలో మాత్రం అలా కాదు బిడ్డ పుట్టిన వెంటనే ఏడాదిగా పరిగణిస్తారు అంటే పుట్టిన వెంటనే వాళ్లకు ఓ సంవత్సరం నిండిపోయినట్లు లెక్క. ఆ తర్వాత కొత్త సంవత్సరం మొదలయ్యే రోజు మరో సంవత్సరం పూర్తయినట్లు. ఉదాహరణకు డిసెంబర్ 31న ఒక బిడ్డ జన్మిస్తే ఆ రోజు ఆ బిడ్డ వయసు ఒక సంవత్సరం అలాగే , జనవరి 1న కొత్త ఏడాది ప్రారంభం కాగానే మరో సంవత్సరం నిండినట్టు అంటే జనవరి 2 నాటికి ఆ బిడ్డ వయసు రెండు సంవత్సరాల ఒక రోజంతా అన్నమాట. ఇలా పాటించే మరో విధానంలో శిశువు జన్మించిన సమయంలో 0 గా లెక్కిస్తారు కొత్త ఏడాది మొదలవగానే ఏడాది అవుతోంది ఈ రెండు విధానాల్లోనూ కొత్త ఏడాది తో వాళ్ళ వయసులు తారుమారై పోతాయి

ఈ విధానం వల్లే కొరియన్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది ఎన్నికల ప్రచార సమయంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు ఈ విధానాన్ని మార్చి వేస్తానని హామీ ఇచ్చారు అందుకే దీనిపై ప్రభుత్వం ఒక పోల్ నిర్వహించింది ప్రభుత్వం. ఇందులో దాదాపు 70 శాతం మంది ప్రజలు మార్పు చేయడమే మంచిదని అభిప్రాయపడ్డారు.

దాంతో సౌత్ కొరియా ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో కొత్త చట్టాన్ని ఆమోదించింది. ఇప్పటి వరకు ఉన్న కొరియన్ ఏజ్ విధానానికి స్వస్తి పలికింది. ఇకపై అంతర్జాతీయంగా ఆమోదం పొందిన ఏజ్ సిస్టం నే ఫాలో అవుతుంది ఈ కొత్త పాలసీ ప్రకారం సౌత్ కొరియా ప్రజల వయస్సు ఒకటి లేదా రెండు సంవత్సరాల వరకు తగ్గిపోతుంది.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!