Self Employment

Why do ants death spiral | గండు చీమలు గుండ్రంగా ఎందుకు తిరుగుతాయి?

చీమలు ఒక దాని వెంట మరొకటి వెళ్ళడం అందరూ చూసే ఉంటారు కానీ ఎప్పుడైనా గండు చీమలను గమనించారా అవి కూడా ఒకదాని వెనుక మరొకటి తిరుగుతాయి… కానీ వలయాకారంలో తిరుగుతాయి. ఇలా తిరగడాన్ని అండ్ మిలన్ అని అంటారు.

అయితే సాధారణ చీమల్లో ఈ మాయ వలయం ఎక్కువగా కనిపించదు. గండు చీమలు మాత్రమే ఇలా వలయాకారంలో తిరుగుతూ ఉంటాయి. గండు చీమలు గుడ్డివి …. వీటికి కళ్లు ఉంటాయి కానీ కనిపించవు. కాబట్టి ఇవి ఒంటరిగా బతకలేవు, జట్టుగా కలిస్తే మాత్రం అద్భుతాలు చేయగలవు. అందుకే ఆహారం కోసం బ్రతకడానికి గుంపులుగా కలిసి వెళతాయి. ఒక చీమ మరొక చీమ అనుసరించేలా పేరామోన్స్ విడుదల చేస్తాయి. ఇది ఇతర చీమలు దారి తప్పకుండా వెళ్లడానికి తోడ్పడుతుంది. రెండు చీమల మధ్య చాలా తక్కువ దూరం ఉండేలా చూసుకుంటాయి. ఈ విధంగా గండు చీమలు హ్యాండ్ మిల్ పద్ధతిని సృష్టించుకుంటాయి. ఇలా క్రమంగా ఇది ఒక పెద్ద గుండ్రటి వలయం లాగ ఏర్పాటుచేసుకుంటాయి.

ఆహారాన్ని వెతుక్కున్న తర్వాత తిరిగి గూటికి చేరుకుంటాయి, సాధారణంగా అడవులు దట్టమైన ప్రాంతాల్లో ఈవలయాలు ఏర్పడుతుంది. ఆహార అన్వేషణ కోసం ఇలా చేసినప్పటికీ ఇది ఒక మాయ వలయం లాగా మారుతుంది. అందుకే దీన్ని యాంట్ స్పైడర్ అఫ్ డెత్ అని పిలుస్తారు. వలయకారాన్ని స్పైరల్ అని అంటారు, మరి డెత్ ఏంటి అనుకుంటున్నారా… ఇందులో ఉన్న చీమలు అలసిపోయి అందులోనే చనిపోతాయి. చీమలు సత్తువ కోల్పోతాయి. హైడ్రేషన్ బారిన పడతాయి. ఆకలితో అలమటించి చనిపోతాయి. ఎందుకంటే ఇది పద్మవ్యూహం వంటిది ఒకసారి ఈ గ్రూప్ లోకి వెళ్ళిన చీమలు స్వతహాగా బయటకు రాలేవు. వర్షం పడటం, బలంగా గాలులు వీయటం వంటి భాగ్య పరిణామాల వల్ల తప్పితే, ఈ వలయం నుండి ఇవి తప్పించుకోలేవు. మరి చచ్చిపోతాయి అని తెలిసి కూడా ఆ వలయంలోకి వెళ్లడం ఎందుకు అనే సందేహం మీకు రావచ్చు.

ఆ గ్రూప్ లో కొన్ని లక్షల చీమలు ఉంటాయి అందులో చనిపోయే చీమల సంఖ్య వేలల్లో ఉంటుంది కాబట్టి చనిపోయే చీమల సంఖ్య పెద్దగా ప్రభావం చూపదు., అందుకే మరణాలను లెక్కచేయకుండా మిగతా చీమలు ఈ వలయం లోనే కొనసాగుతూ ఉంటాయి ఆహార కోసం. ఇది గండు చీమలు వలయాకారంలో తిరగడం వెనుక ఉన్న కారణం.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!