Self Employment

BUSINESS IDEAS : ఇడ్లి దోశ పిండి సేల్ తో చక్కటి ఆదాయం

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చి పెట్టె బిజినెస్ ఏదైనా ఉందంటే అది ఫుడ్ బిజినెస్ అనే చెప్పొచ్చు. ఫుడ్ బిజినెస్ అనగానే హోటల్స్ టిఫిన్ సెంటర్ లేకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మాత్రమే అని అనుకోకండి. వంట రాని వారు కూడా ఇంట్లో ఉంటూనే చేయగలిగే ఒక చక్కటి బిజినెస్ ఐడియా ఇది . ఆ బిజినెస్ ఏంటి అంటే ఇడ్లి మరియు దోశ పిండి సేల్ బిజినెస్. చేప్పుకోడానికి చాలా తేలికగా ఉన్నా ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలలో ఈ బిజినెస్ చాల జోరుగా నడుస్తోంది.

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ప్రజలు తమతమ పనులను కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నారు. భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్లాల్సి వస్తుండంతో రెడీమేడ్ ఆహార వస్తువులకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. గతంలో ప్రజలు తమ ఇంట్లోనే దోసెల పిండి మరియు ఇడ్లీ పిండిని చేసుకుని టిఫిన్లు వేసుకునేవారు. అయితే ఇప్పుడు అంత తీరిక లేకపోవడంతో అందరూ బయటే కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్రీస్ పాయింట్, రెడీమేడ్ చపాతీ, పుల్కా , లాంటి రెడీ టూ ఈట్ వస్తువులకు డిమాండ్ బాగా పెరిగింది. అందువలన ఈ దోశ లేదా ఇడ్లీ పిండిని మనం రెడీమేడ్ గా తయారు చేసి అందిస్తే చక్కటి లాభాలను పొందవచ్చు. ఈ బిజినెస్ ను ఆడవారు చేయడానికి ఎంతో వీలుగా ఉంటుంది. ఇడ్లీ, దోస పిండి తో లాభం ఏమొస్తుంది అని ఉంటుందని భయపడకండి. గ్రామీణప్రాంతాల్లోని మహిళలు యువత ఈ ఐడియాను ఆచరణలో పెడితే అది చక్కటి స్వయం ఉపాధి అవకాశం ఉంటుంది

ఇక ఈ బిజినెస్ ప్రారంభించడానికి మనకి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం. సహజంగా పిండి తయారు చేయడానికి మన ఇంట్లో గ్రైండర్ ఉంటుంది. దానినే మనం ఈ బిజినెస్ కు ఉపయోగించుకోవచ్చు. లేదు మీరు పెద్ద స్థాయిలో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మీరు పెట్టాలనుకున్న పెట్టుబడి వ్యాపారం ని బట్టి వెట్ గ్రైండర్ కొనుగోలు చేయాలి . వెట్ గ్రైండర్ ఐదు లీటర్ల కెపాసిటీ నుంచి 20 లీటర్ల కెపాసిటీ వరకు కమర్షియల్ కేటగిరీలో అందుబాటులో ఉంటాయి. 20 లీటర్ల బెడ్ గ్రైండర్ 80 నిమిషాల్లో 14 కేజీల పిండి రుబ్బుతుంది. దీనిదర మార్కెట్లో 50 నుంచి 60 వేల మధ్య ఉంటుంది.

అలాగే పిండి వేసుకోవడానికి, పప్పు నానబెట్టి దానికి పెద్ద పెద్ద పాత్రలు కావాల్సి ఉంటుంది. కమర్షియల్ కే వ్యాపారానికి ఇరవై లీటర్లు అంతకన్నా పెద్ద అల్యూమినియం పాత్రలు తీసుకోవాలి. అలాగే ప్యాకింగ్ మిషన్ కూడా కొనుగోలు చేసుకుంటే ప్యాకింగ్ సమయం ఎంత అవుతుంది. మార్కెట్లో ప్యాకేజింగ్ కెపాసిటీ ని బట్టి వీటి ధర 50 వేల నుంచి 5 లక్షల దాకా ఉంది. మీరు చిన్న వ్యాపారంగా దీన్ని స్టార్ట్ చేస్తే ప్యాకేజింగ్ మిషన్ అవసరం ఉండదు. ఒక కవర్ సీలింగ్ మిషన్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇడ్లీ దోశ పిండి ని ప్యాక్ చేసేందుకు మార్కెట్లో మాయిశ్చర్ ప్రూఫ్ కవర్లు లభిస్తాయి. 500 గ్రాముల నుంచి రెండు కేజీల వరకు సామర్థ్యమున్న కవర్లు లభిస్తాయి కాబట్టి వీటిని తీసుకోవాలి. దీనితోపాటు ఇడ్లీ రవ్వ, దోస రవ్వ కావాలి. వీటిని గ్రైండర్ లో ఆడుకుని పిండిగా తయారు చేయాలి. అనంతరం వాటిని కవర్లలో ప్యాకింగ్ చేయాలి.

ఇక ఈ బిజినెస్ లో ఖర్చులు, లాభాలు గురించి ఒకసారి చూద్దాం. మనం ఈ బిజినెస్ లో 30 నుండి 40 శాతం లాభాలు ఉండే విధంగా చూసుకోవాలి. అంటే రోజుకి 2000 సేల్ మీద 600 నుంచి 800 లాభాన్ని పొందవచ్చు. ఉదాహరణకు ఒక కేజీ మినప్పప్పు ధర 150 నుంచి 200 వరకు ఉంటుంది. మూడు కేజీల ఇడ్లీ రవ్వ ధర 120 నుంచి 150 వరకు ఉంటుంది. మీరు ఈ ముడిసరుకు ఎక్కువగా కొనుగోలు చేస్తే ధర ఇంకాస్త తక్కువగా లభిస్తుంది. ఒక కేజీ మినప్పప్పు మూడు కేజీల ఇడ్లీ రవ్వ తో ఆరు కేజీల పిండి తయారు చేయొచ్చు అలా తయారు చేసిన పిండిని ఒక కేజీ 80 రూపాయలకు అమ్మితే ఆరు కేజీల పిండికి 480 రూపాయలు వస్తాయి పెట్టుబడి ఖర్చులు పోగా కేజీకి 130 వరకు లాభం వస్తుంది. ఈ లెక్కలో ఒక రోజుకు 30 కేజీల పిండి అమ్మిన 600 రూపాయలు వరకు లాభం ఉంటుంది అంటే నెలకు 18 వేల రూపాయలు సంపాదించొచ్చు మాట.

ఇక అమ్మకం విషయానికి వస్తే వీటిని మనం ముందుగా మన ఇంటి బయటే ఒక టేబుల్ పెట్టుకుని సేల్ చేయవచ్చు. మన చుట్టుపక్కల ఉన్న వారితో మన బిజినెస్ గురించి వివరిస్తే వారు అవసరమైన ఇడ్లి మరియు దోశ పిండిని మీ దగ్గరే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ కొంచెం పెద్ద తరహాలో చేయాలనుకుంటే రోడ్డుపై ఒక స్టాల్ లాంటిదాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు లేదా ఒక షాపును కూడా అద్దెకు తీసుకోవచ్చు. అయితే ముందుగా చిన్న తరహాలో ప్రారంభించి వ్యాపారాన్ని పెంచుకోవడం ఉత్తమం. అలాగే మీ ఏరియాలో ఉన్న చిల్లర దుకాణాలు, సూపర్ మార్కెట్లు, పాల ప్యాకెట్లు డోర్ డెలివరీ చేసే వాళ్లతో కలిసి కమిషన్ ప్రాతిపదికగా వ్యాపారం చేస్తే ఆర్డర్లు పెరిగి మీ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది

ఈ బిజినెస్ లో కొంచెం నిలదొక్కుకుంటే చాలు మన వ్యాపారం విస్తరించే కొద్దీ అనేక లాభాలను పొందవచ్చు. ఇప్పటికె ఈ తరహా బిజినెస్ లు చాలా చోట్ల మొదలయ్యి విజయవంతంగా కొనసాగుతున్నాయి. అందువలన ఏదొక వ్యాపారం చేసి నిలదొక్కుకోవలని చూసే వారు ఇటువంటి బిజినెస్ లపైన కొంచెం ఫోకస్ చేస్తే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు.

సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ్టి బిజినెస్ ఐడియా ఇటువంటి రిస్క్ లేని వ్యాపారం ప్రారంభించే ముందు తగిన పరిశోధన చేసి అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ఎక్కడ డిమాండు ఉందో తెలుసుకుని ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేసి ఇందులో మంచి లాభాలు సంపాదించుకోవాలని కోరుకుంటూ మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మల్లి కలుద్దాం అంతవరకూ సెలవు నమస్కారం.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!