Andhra Pradesh Govt Jobs

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు పండగే 6100 పోస్టులతో డీఎస్సీ, 689 పోస్టులతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో జాబ్స్

ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ అభ్యర్థులు ఊహించినట్లుగానే 6100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఫిబ్రవరి నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది.

👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన 31 జనవరి 2024న మంత్రివర్గ సమావేశం ఏర్పాటు జరిగి జరిగింది ఈ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. నోటిఫికేషన్ల విడుదల పైన చర్చించారు ఫిబ్రవరి నెలలో విడుదల కానున్న డీఎస్సీలో 6100 ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే వైద్య ఆరోగ్య శాఖలో కూడా పలువురు పలు ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.

👉 ఇందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా 6100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ కి మార్గం సుగమమైంది అలాగే 689 పోస్టులతో రాష్ట్ర అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

👉 అటవీ అటవీ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది ఈ ఉద్యోగాలకు విద్యార్హతలు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు

👉ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించి స్టడీ మెటీరియల్ కోసం మా టెలిగ్రామ్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అవ్వండి

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!