వాలంటీర్ ఉద్యోగాలకు దరఖాస్తులుజిల్లాలో పలు మండలాలు, మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న వాలంటీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ పేర్కొన్నారు. 35 మండలాలు, మరో ఏడు మున్సిపాలిటీలలో 116 వార్డు, గ్రామ వాలంటీరు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
👉ఈమేరకు ఆసక్తి, అర్హత కలిగిన యువత ఈ నెల 9వతేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా వెబ్ సైట్ పరిశీలించాలని పేర్కొన్నారు.