Private Jobs

రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక కేవలం ఐటిఐ పాస్ అయితే చాలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాదులో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లేబరేటరీ సంయుక్తంగా 2024- 2025 సంవత్సరానికి గాను ఐటిఐ పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థుల నుంచి అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం తొమ్మిది విభాగాల్లోని దాదాపు 127 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఆసక్తి మరియు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మీ సర్టిఫికెట్లలో ఉన్న మార్పుల ఆధారంగా మరియు మీ ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది

ఇవి పర్మినెంట్ ఉద్యోగాలు అయితే కాదు కేవలం కాంట్రాక్ట్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఒక్క సంవత్సరం పాటు శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది శిక్షణతో పాటు ఎంపికైన అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపంలో వేతనాన్ని అందిస్తారు

🔥 ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

డిఆర్డిఓ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 127 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఇవి మొత్తం తొమ్మిది విభాగాలలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు విభాగాల వారి విభాగాలు చూసుకున్నట్లయితే ఫిట్టర్, టర్నర్, మెకానిస్ట్, ఎలక్ట్రిషన్, వెల్డర్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఆపరేటర్, బుక్ బైండర్, కార్పెంటర్ మొదలగునవి మొదలగు 9 విభాగాలలో మొత్తం 127 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హతల విషయానికి వస్తే సంబంధిత విభాగంలో ఎన్సివిటి లేదా ఎస్సి వీటి ఐటిఐ పాస్ సర్టిఫికెట్ అవసరమవుతుంది. అలాగే అభ్యర్థులకు వయస్సు 31 మే 2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి ఎంపిక విధానం చూసినట్లయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం విద్యార్హతల వచ్చిన మార్పుల ఆధారంగా షార్ట్ లిస్టు చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపికానిది చేయడం జరుగుతుంది ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు శిక్షణ అనేది ఇస్తారు ఈ శిక్షణ సమయంలో స్కాలర్షిప్ రూపంలో వేతనం అనేది ఇవ్వడం జరుగుతుంది.

📌 తెలంగాణ లో ఉద్యోగాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ఉద్యోగాలకు ఎటువంటి దరఖాస్తు ఫీజు అనేది లేదు కాబట్టి ఆసక్తి అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఐటిఐ పాసైన ప్రతి ఒక్క అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్లో దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 31 మే 2024 సాయంత్రం 5 గంటల లోపు అభ్యర్థులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది

Online Registration

⭐  వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి ⭐  టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండి
👉 వాట్సాప్ గ్రూప్ 👉 టెలిగ్రామ్ గ్రూప్

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!