Andhra Pradesh Private Jobs

ప్రకాశం జిల్లా కోర్టులో టైపిస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ప్రకాశం జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలులోని కోర్టులో ఉద్యోగాల బట్టికి నోటిఫికేషన్ విడుదలైంది ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగానికి 20 మే 2024 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఉద్యోగానికి సంబంధించి విద్యార్హతలు వయస్సు మరియు ఎంపిక విధానం తదితర వివరాల కోసం క్రింది ఇచ్చిన ఆర్టికల్ ను పూర్తిగా చదవగలరు.

ప్రకాశం జిల్లా డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా టైపింగ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని భర్తీ చేరున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఒక ఉద్యోగాన్ని భర్తీ చేయనున్నారు ఆసక్తి మరియు అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలు కేవలం కాంట్రాక్టు పద్ధతిలో మాత్రమే భర్తీ చేస్తున్నారు.

ప్రకాశం జిల్లా లీగల్ సర్వీసెస్ అధారిటీ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే టైపిస్ట్ మరియు అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 18500 వేతనం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి అలాగే కంప్యూటర్ కలిగి ఉండాలి ఇంగ్లీషులో టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ పాసై ఉండాలి. అలాగే ఫైల్ మెయింటెనెన్స్ మరియు ప్రాసెసింగ్ పైన అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయస్సు 30 ఏప్రిల్ 2024 నాటికి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు ఉండాలి అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల వారికి అంటే ఎస్సీ ఎస్టీ మరియు బీసీ కేటగిరి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయస్సు పరిమితిలో సడలింపు ఉంటుంది

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం అనేది జరుగుతుంది ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు

అర్హతలు మరియు ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫారం ఫిల్ అప్ చేసిన తర్వాత సంబంధిత అర్హత పత్రాలను జతపరిచి దానిని చైర్పర్సన్ అండ్ ప్రిన్సిపల్, డిస్ట్రిక్ట్ జడ్జ్, డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, కోర్టు కాంప్లెక్స్ ,ఒంగోల్, ప్రకాశం జిల్లా అనే చిరునామాలు అందజేయాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 20 మే 2024

⭐  వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి ⭐  టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండి
👉 వాట్సాప్ గ్రూప్ 👉 టెలిగ్రామ్ గ్రూప్

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!