Telangana Jobs

TSRTC Jobs | తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి కొత్తగా 3 వేలకు పైగా ఉద్యోగాలు బట్టి నోటిఫికేషన్ విడుదల కాబోతోంది ఈ మేరకు ఖాళీల భర్తీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కొత్త నియామకాలు చేపట్టలేదు అయితే కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రస్తుతం ఈ ఉద్యోగాలపై దృష్టి పెట్టింది మొత్తం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 43 వేలకు పైగా ఉద్యోగులు ఉద్యోగాలు చేస్తున్నారు గత పది సంవత్సరాలుగా ఈ సంస్థలో ఉద్యోగాల భర్తీకి ఎటువంటి నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో ప్రతి సంవత్సరం రిటైర్ అవుతున్న ఉద్యోగులతో ఖాళీలు పెరుగుతున్న ఉన్న ఉద్యోగులతోనే గత ప్రభుత్వం పనిచేయిస్తు వచ్చింది.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తెలిపిన తాజా సమాచారం ప్రకారం మొత్తం 3035 ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నట్టు ప్రతిపాదనలు పంపారు ఒక మార్చి నెలలోని 176 మంది ఉద్యోగులు రిటైర్మెంట్ తీసుకున్నారు. ఏప్రిల్ నుంచి డిసెంబర్ మాసంలో ఇంకో 1345 మంది ఉద్యోగస్తులు రిటైర్మెంట్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు ఇప్పటివరకు 403 మంది డ్రైవర్లు 3550 మంది కండక్టర్లు రిటైర్ అయ్యారు అంతేకాకుండా రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడినప్పటి నుంచి రెండు వేలకు పైగా కొత్త బస్సులను తీసుకున్నారు ప్రజల అవసరాలు మరియు దృష్ట్యా మరియు ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ లో మహిళలు ఉచిత ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నారు ఇలా కొత్త బస్సులు మరియు ఉద్యోగుల రిటైర్మెంట్ తో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై పనిభారం పెరుగుతుంది కాబట్టి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది.

⭐  వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి ⭐  టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండి
👉 వాట్సాప్ గ్రూప్ 👉 టెలిగ్రామ్ గ్రూప్

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!