Latest Jobs | ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

20240115 085731

నిరుద్యోగులకు శుభవార్త విజయవాడలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నుంచి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం డిగ్రీతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు 12 జనవరి 2024 నుంచి 1 ఫిబ్రవరి 2024 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగాల వివరాలు

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

సంస్థ పేరు డాక్టర్ వైఎస్ ఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం

ఉద్యోగం పేరు జూనియర్ అసిస్టెంట్

ఉద్యోగాల సంఖ్య 20 పోస్టులు

విద్యార్హత ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ పాసై ఉండాలి

వయస్సు పరిమితి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 1 జూలై 2024 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ బిసి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకూ వయసు పరిమితిలో సడలింపు ఉంటుంది

జీతం ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 25 వేల రెండు వందల ఇరవై రూపాయలు నుంచి గరిష్ఠంగా 80 వేల 910 రూపాయల వరకు వేతనం ఉంటుంది

దరఖాస్తు ఫీజు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎస్సి ఎస్టి మాజీ సైనికులు దివ్యాంగ అభ్యర్థులకు 750 రూపాయలను దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఇతర అభ్యర్థులకు 1500 రూపాయలను దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రిలిమినరీ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ కంప్యూటర్ టెస్ట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు

ముఖ్యమైన తేదీల వివరాలు

ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభం అయ్యే తేదీ 12 జనవరి 2024

దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ 31 జనవరి 2024

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 1 ఫిబ్రవరి 2024.

Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!