Free Drone Training | శిక్షణ ఇచ్చి నెలకు 60,000 సంపాదన

Screenshot 20240207 143430

ఉమ్మడి అనంతపురం జిల్లాలో గల నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. చదువుకుని డిగ్రీల చేతపట్టుకొని ఇంటర్వ్యూలకు హాజరు అవుతూ ఉద్యోగం లేక బాధపడుతున్న వారికి శిక్షణ ఇచ్చి ఈ శిక్షణ ద్వారా రోజుకు దాదాపు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల ఆదాయం పొందే విధంగా అనంతపురం జిల్లాలోని ఏ ఎఫ్ ఎకాలేజీ సెంటర్ లో డ్రోన్ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.

ఆసక్తి మరియు అర్హతలు కలిగిన అనంతపురం జిల్లాకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి ద్వారా ఎవరి పైన ఆధారపడకు నెలకు అరవై వేల రూపాయల వరకు ఆదాయం సంపాదించుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింద ఇచ్చిన సమాచారాన్ని చూడండి.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండిస్తూ ఉంటారు ముఖ్యంగా అరటి, మొక్కజొన్న, వరి పంట, కందిపప్పు, వేరుశనగ పండిస్తారు ఇలా అధిక మొత్తంలో పండించే సమయంలో పంటకు పురుగు మందులు పిచికారీ చేయాలి అంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే డ్రోన్ ద్వారా కేవలం తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో పంటలకు పురుగు మందులు పిచికారీ చేయవచ్చు. అయితే ఇలాంటి డ్రోన్లను ఆపరేట్ చేయడానికి శిక్షణ అనేది చాలా అవసరం కాబట్టి ఉమ్మడి అనంతపురం జిల్లాలో గల నిరుద్యోగ అభ్యర్థులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకొని నెలకు మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు.

ఈ శిక్షణ పూర్తి అయిన తర్వత కేంద్ర ప్రభుత్వం స్కీమ్ లో భాగంగా కొనుగోలు పైన సబ్సిడీ ఉన్న వాటిని అప్లై చేసుకొని డ్రోన్ ను కొనుగోలు చేసుకుని రోజుకు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు.

👉విద్యార్హతలు ఈ డ్రోన్ శిక్షణ తరగతులకు హాజరు అవ్వాలి అనుకుని నిరుద్యోగ అభ్యర్థులు డిప్లమా లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ పాస్ అయి ఉండాలి అలాగే డిగ్రీ లేదా బీటెక్ పాస్ అయిన లేదా ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు విధానం ఈ డ్రోన్ శిక్షణ తీసుకోవాలని కొన్ని ఉమ్మడి అనంతపురం జిల్లాలో గల నిరుద్యోగ అభ్యర్థులు అనంతపురం జిల్లాలో ఉన్న ఆర్ డి టి స్టేడియం ఆపోజిట్ లో గల ఏ ఎఫ్ ఎకాలజీ డ్రోన్ సెంటర్లో తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

దరఖాస్తు చేసే సమయంలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు మరియు విద్యా అర్హత పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది

ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వయసు 19 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి ఈ డ్రోన్ శిక్షణకు దరఖాస్తులు 9 ఫిబ్రవరి 2024 నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్ డి టి స్టేడియం ఆపోజిట్ లో గల ఎకాలజీ సెంటర్ లో దరఖాస్తులను స్వీకరిస్తారు

👉మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి

Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!