హాకీలో సెంచరీలు చేసిన ధ్యాన్ చంద్

ఫోర్లు, సిక్సర్లు, సెంచరీలు క్రికెట్ సంబంధించినవి. కానీ మన హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ ప్రపంచంలో ఇంత వరకూ ఎవరూ సాధించని ఘనతను సొంతం చేసున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగానే ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకొంటున్నాం. ధ్యాన్ చంద్ క్రీడా జీవితంలో నాలుగు సెంచరీలు సాధించారు. అంటే 400కు పైగా గోల్స్ చేశారు. సాటి లేని ఈ క్రీడా దిగ్గజం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు…..

బెర్లిన్ లో 1936 ఒలింపిక్స్ సందర్భంగా ధ్యాన్ చంద్ కు హిట్లర్ ఒక ఆఫర్ ఇచ్చాడు. ఆనాటి ప్రారంభ వేడుకలను హిట్లర్ మైదానంలో కూర్చుని వీక్షించాడు. ఆ తర్వాత జర్మనీతో జరిగిన మ్యాచ్ లో ధ్యాన్ చంద్ గోల్స్ వర్షంతో భారత్ ఘన విజయం సాధించింది. ఆ మర్నాడు హిట్లర్ ధ్యాన్ చంద్ ను పిలిపించుకుని మాట్లాడాడు. ధ్యాన్ చంద్ జర్మనీ పౌరసత్వం తీసుకుని స్థిరపడితే ఆర్మీలో జనరల్ హోదా ఇస్తానని, తమ జాతీయ హాకీ జట్టుకు చీఫ్ కోచ్ గా భారీ వేతనంతో నియమిస్తానని చెప్పాడు. కానీ ఈ ఆఫర్ ను ధ్యాన్ చంద్ తిరస్కరించాడు. తాను భారతీయుడిగా సంతోషంగా ఉన్నానని చెప్పాడు.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

ఆమ్ స్టర్ డ్యాంలో హాకీ మ్యాచ్ ముగిసిన తర్వాత స్టేడియంలోని ఒక వృద్ధ మహిళ ధ్యాన్ చంద్ ను దగ్గరికి పిలిచింది. తన వాకింగ్ స్టిక్ ను చూపిస్తూ, దీంతో గోల్ చేయగలవా అని అడిగింది. అది తీసుకున్న ధ్యాన్ చంద్ తన సహచరులతో కలిసి మళ్లీ ఆడాడు. రెండో నిమిషాల్లో వాకింగ్ స్టిక్ తో గోల్ చేశాడు.

ధ్యాన్ చంద్ అంత అలవోకగా గోల్స్ వర్షం కురిపించడంతో ఒక సారి జపాన్ లో అక్కడి అధికారులకు అనుమానం వచ్చింది. అతడి బ్యాట్ లో బంతిని ఆకర్షించే అయస్కాంతం ఉందేమో అని విరగ్గొట్టి చూశారు. అలాంటిదేమీ కనిపించలేదు.

ధ్యాన్ చంద్ ను ఎంతో మంది ప్రముఖులు వేనోళ్ల పొగిడారు. వారిలో క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్ మన్ ఒకరు. ఆస్ట్రేలియాలో ధ్యాన్ చంద్ ఆడిన హాకీ మ్యాచ్ ను బ్రాడ్ మన్ స్టేడియంకు వెళ్లి వీక్షించాడు. అలవోకగా గోల్స్ చేసే టెక్నిక్ చూసి ఆశ్చర్యపోయాడు. మేం క్రికెట్ లో రన్స్ చేసినంత ఈజీగా ధ్యాన్ చంద్ గోల్స్ చేస్తున్నాడని మెచ్చుకున్నాడు. ఇలాంటి మెరుపులు ధ్యాన్ చంద్ జీవితంలో చాలానే ఉన్నాయి. భారత్ లో క్రీడాకారులకు భారతరత్న ఇచ్చేలా నిబంధనల్ని మారిస్తే మొదట ధ్యాన్ చంద్ కే దక్కాలని క్రీడాకారులందరూ ముక్త కంఠంతో కోరారు. కానీ అది ఇంతవరకు జరగలేదు. నిబంధనల్ని మార్చిన తర్వాత సచిన్ టెండుల్కర్ కు భారత రత్న ఇచ్చారు. అదే సమయంలో ధ్యాన్ చంద్ కు కూడా ప్రకటిస్తే బాగుండేదని చాలా మంది క్రీడాకారులు అభిప్రాయపడ్డారు.

Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!