ఇంకుడు గుంతలు ఉపయోగాలు ? ఎక్కడ ఎలా నిర్మించాలి?

ఇంకుడు గుంతలు


గత కాలంలో భూగర్భ జలాలు అతి తక్కువ లోతులోనే లభ్యమయ్యేవి. వర్షాభావం వల్ల, అధికంగా భూగర్భ జలాలను వాడుకోవడం వలన భూగర్భ జల మట్టం రానురాను క్రిందికి పోతున్నది. పాతాళ జలం ప్రమాదకరస్థాయికి పడిపోయింది. వెయ్యి అడుగుల లోతున తవ్వితే కానీ బోర్లలో నీటి చుక్క జాడ కనిపించట్లేదు. 300-400 అడుగుల కన్నా లోతు నుంచి వచ్చే నీటిలో ఆరోగ్యానికి హాని కలిగించే భారలోహాలు, రసాయనాలు ఉంటాయి. అవి తాగడానికి పనికిరావని నిపుణులు చెబుతున్నారు. దీని వలన పర్యావరణంలో మార్పులు చాల త్వరగా వచ్చే అవకాశమున్నది. ఈ భూగర్భ జల మట్టం ప్రమాద స్థాయికి చేరక ముందే మేల్కొని భూగార్భ జల మట్టాన్ని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇందుకు ఇంకుడు గుంతలు ఒక మార్గం. ఈ కార్యక్రమాన్ని వ్వక్తి గతంగానే కాకుండా సామాజిక పరంగా కూడా భారీ ఎత్తున చేపట్ట గలిగితే సరైన ప్రతి ఫలము పొందగలరు.

ఇంకుడు గుంతలను నిర్మించడం ఎలా?

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now


ప్రధానంగా బోరు బావుల సమీపంలో ఈ ఇంకుడు గుంతలు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం కూడా సంకల్పించింది. ప్రతి బోరు బావి వద్ద సుమారు రెండు మీటర్లు పొడవు, ఒక మీటరు వెడల్పు, ఒక మీటరు లోతు గల గుంతలను త్రవ్వాలి. ఆ గుంతలో పావు భాగము పెద్ద బండ రాళ్ళతో నింపాలి, ఆ తర్వాత రెండు పావు భాగాలు పెద్ద కంకరతో నింపాలి. గుంత లోపల కొంత భాగం ఖాళీగా వుంచి పైన మూత ఏర్పాటు చేయాలి. ఆ చుట్టు ప్రక్కల పడిన వర్షపు నీరు ఆ ఇంకుడు గుంతల్లోకి చేరు విధంగా కాలువ/ పైపుల ద్వారా వచ్చే ఏర్పాటు చేయాలి. ఈ ఇంకుడు గుంతలు నేల స్వభావాన్ని బట్టి, పరిసరాలను బట్టి, నీటి లభ్యతను బట్టీ గుంతల పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లోను, పొలాల్లోనూ చాల పెద్ద ఇంకుడు గుంతలు నిర్మించవచ్చు. ఇలాంటి పెద్ద గుంతలకు పైన, కప్పు అవసరముండదు.

ఉపయోగములు
వర్షపునీటిని వృధాగా పోనీయకుండా ఎక్కడికక్కడ ఆ జలాలను ఇంకుడుగుంతలలోనికి చేర్చగలిగితే భూగర్భ జల మట్టం పెరగడానికి ఎంతగానో దోహదపడతాయి. ఆరుబయట, ఇళ్ల ప్రహరీ లోపల, బోర్ల చుట్టు పక్కల ఇంకుడుగుంతల నిర్మాణం చేపడితే భూగర్భ జలం పెరుగుతుంది. ఏటేటా తగ్గిపోతున్న భూగర్భ జలమట్టం వృద్ధికి ఇంకుడుగుంతలే శరణ్యం. వీటి నిర్మాణానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. వీటిని నిర్మించి వృథా నీటిని వాటిలోకి పంపించడం ద్వారా ఆ ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం పెంపొందించుకోవచ్చు. ఇంకుడు గుంతలు నిర్మించినందున ఆ చుట్టు ప్రక్కల పడిన వృధాగా పోయే వర్షపు నీరు ఆ గుంతలో చేరి భూగర్భ జల మట్టము పెరిగి ఇదివరకు ఎండిపోయిన గొట్టపు బావులు తిరిగి జలసిరితో నిండిన సందర్బాలు అనేకం ఉన్నాయి.

ఇంకుడు గుంతలు ఎక్కడ నిర్మించాలి?
ఇంకుడు గుంతలు పలాని చోట నిర్మించాలని ఏమి లేదు తమకు అనుకూలమైన ప్రతి చోట వాటిని నిర్మించుకోవచ్చు.

ఇళ్ళలో
ముఖ్యంగా నగరాలలో అంతటా కాంక్రీటు మయం అయినందున, ఇళ్ళు, రోడ్లు, మొదలైనవన్నీ కాంక్రీటు మయం. కనుక వర్షపు నీరు భూమిలోనికి ఇంకే అవకాశమేలేదు. నగరంలోని ప్రతి గృహస్థుడు తన ఇంటి ఆవరణంలో ఇంకుడు గుంతలను నిర్మించి తమ ఇంటి డాబా మీద పడిన వర్షపు నీటిని ఈ ఇంకుడు గుంతలలోనికి వెళ్ళేటట్లు మార్గాలను ఏర్పరచాలి. ఇంటి ఆవరణంలో బోరు బావి వుంటే దానికి అతి దగ్గరగా ఈ గుంటను ఏర్పాతు చేస్తే బోరు బావి ఎన్నటికి ఎండదు.

పార్కులలో
పార్కులు, ఇతర ఇతర విశాలమైన ఆవరణముగల ప్రదేశాలలో ఒక మూలగా పెద్ద ఇంకుడు గుంతను ఏర్పాటు చేయాలి, ఆ ప్రదేశంలో పడిని వర్షపు నీటిని ఆ గుంతల్లోకి ప్రవహించే ఏర్పాటు చేసుకోవాలి.

రోడ్ల ప్రక్కన
రోడ్ల ప్రక్కన కూడా పెద్ద ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవచ్చు.

పొలాల్లో
పలలెల్లోని పొలాలలో పెద్ద ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలి. అందులో చేరిన నీటిని వర్షాకాలమంతా ఇతర వ్యవసాయ పనులకు వాడుకోవచ్చు. అంతే గాగ ఆ గుంత లోనీరు ఇంకి భూగర్భ జల మట్టము పెరిగుతుంది.

Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!