Subhash Chandra Bose death Telugu : నేతాజీ గురించి పూర్తి సమాచారం

గాంధీజీ 1869 అక్టోబర్ 2 న జన్మించి 1948 జనవరి 30న మరణించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875 అక్టోబరు 31న జన్మించి 1950 డిసెంబరు 15న మరణించాడు. జవహర్లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14 న జన్మించి 1964 మే 27న మరణించాడు

ఇలా స్వాతంత్ర పోరాటంలో ఉన్న ప్రతి ఒక్కరి డేట్ అఫ్ బర్త్ డే, డేట్ ఆ డెత్ వివరాలు అందరికీ తెలుసు. ఒక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్ ది తప్ప.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న జన్మించారు. కానీ ఆయన ఎప్పుడు చనిపోయారు, ఎలా చనిపోయారు అనే వివరాలు ఎవరికీ తెలీదు. భారతదేశంలో ఇప్పటికి అంతుచిక్కని మిస్టరీ ఏదైనా ఉంది అంటే అది నేతాజీ మిస్టరీనే.

కొంతమంది నేతాజీ 1945లో ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారు అని అంటారు. ఇంకొంతమంది లేదు దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత నేతాజీ రహస్యంగా అంతర్జాతీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అని అంటారు. మరి కొంతమంది లేదు లేదు నేతాజీ ఓ బాబా గా మారి భారత్ వచ్చేసారు 1985 వరకు ఇక్కడే ఉన్నారు అని చెబుతారు. కానీ ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో ఇప్పటికీ అంతుపట్టని మిస్టరీనే.

అలాగే నేతాజీ కి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన కొన్ని కీలక డాక్యుమెంట్లు పై ఓ సారి ఫోకస్ చేద్దాం.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒరిస్సా లో నివసించే ఓ సంపన్న బెంగాలీ కుటుంబంలో 1897 జనవరి 23న జన్మించారు. ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసేందుకు ఇంగ్లండు వెళ్లారు నేతాజీ కానీ జాతీయవాదం భావాలున్న నేతాజీకి బ్రిటిష్ వారి క్రింద పనిచేయడం ఇష్టం లేదు. అందుకే ఫైనల్ ఎగ్జామ్ రాయకుండానే తిరిగి ఇండియా చేశారు. భారత్ తిరిగి వచ్చిన తర్వాత దేశంలో జరుగుతున్న జాతీయవాద స్వాతంత్ర పోరాటం ఆయన బాగా ఆకర్షించింది. 1921లో కాంగ్రెస్ లో చేరి గాంధీజీ నాయకత్వంలో దేశ స్వాతంత్ర పోరాటంలో తొలి అడుగులు వేశారు. 1938లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. కానీ ఆ తరువాత గాంధీజీతో సంయమనం కుదరకపోవడంతో నేతాజీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆతరువాత పార్టీ నుంచి కూడా వెళ్ళిపోయారు అదే సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతోంది ఆ యుద్ధంలో బ్రిటిష్ తరపున పోరాడేందుకు 25 లక్షల మంది సైనికులను భారత్ తరవున అందించేందుకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంగీకరించింది.

ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ కి సహకరిస్తే దానికి ఫలితంగా దేశానికి స్వతంత్రం ఇస్తారని గాంధీ మిగిలిన కాంగ్రెస్ భావించింది. కానీ ఇది నేతాజీకి ఆగ్రహం తెప్పించింది మనల్ని అణిచివేస్తున్న బ్రిటిషర్ల కోసం మన సైనికులు ప్రాణాలు ఇవ్వటం ఏమిటని కాంగ్రెస్ ను నేతాజీ నిలదీశారు. బెంగాల్ ప్రజలను ఏకం చేసి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఉద్యమం జరిపారు. దీంతో బ్రిటిషు ప్రభుత్వం నేతాజీని అరెస్ట్ చేసింది వారం రోజుల పాటు జైల్లో ఉంటూ తిండి తిప్పలు లేకుండా నిరాహారదీక్ష చేశారు. దీంతో ఆయన్ను వదిలిపెట్టిన బ్రిటిష్ ప్రభుత్వం కలకత్తా వదిలి వెళ్ళడానికి వీలు లేదని హెచ్చరించారు.

RSS Error: A feed could not be found at `http://www.tejajobs.com/`. This does not appear to be a valid RSS or Atom feed.

అప్పుడే నేతాజీ ఓ నిర్ణయానికి వచ్చారు. దేశంలోనే ఉంటూ బ్రిటిషర్లను తరిమి కొట్టడం సాధ్యం కాదు అని ఆయన అనుకున్నారు. అందుకే విదేశీ శక్తులను కూడగట్టాలని అనుకున్నారు. ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరిస్తున్న జర్మన్ నియంత, నాజీ లీడర్ అయిన హిట్లర్ తో చేతులు కలిపారు. కాంగ్రెస్ ను వదిలిపెట్టి రెండుఏళ్లు కూడా గడవకముందే 1941లో నేతాజీ జర్మని వెళ్లారు. జర్మనీ నియంత హిట్లర్ ని కలిసి భారత స్వాతంత్రం కోసం సహాయం చేయాలని కోరారు. హిట్లర్ కూడా సరేనన్నాడు దాదాపు 5000 మంది సైనికులతో భారత స్వాతంత్ర పోరాట సైన్యాన్ని ఏర్పాటు చేశారు నేతాజీ సుభాష్ చంద్రబోస్.

ఆ తరువాత 1942 నాటికి జర్మనీ సైన్యం రష్యాపై యుద్ధానికి సిద్ధమైంది. ఆ టైంలో తన ఆజాద్ హింద్ ఫౌజ్ తో సహా నేతాజీ భారత్ వైపు కదిలారు. అలా సింగపూర్ చేరి అక్కడ జపాన్ మలేషియా ఫిలిప్పీన్స్ వంటి దేశాలతో కలిసి ఏకంగా 40 వేల మంది తో భారత జాతీయ సైన్యం (ఇండియన్ నేషనల్ ఆర్మీ) ని ఏర్పాటు చేశారు. ఈ సైన్యాన్ని ఏర్పాటు చేయడానికి జపాన్ సహాయం తీసుకున్నారు నేతాజీ. అప్పటికే ఆయన బ్రిటిష్ ఇండియా చుట్టుపక్కల ఉన్న అనేక దేశాల్లో బ్రిటిష్ సైన్యాన్ని ఓడించి ఆ ప్రాంతాలను ఇండియన్ నేషనల్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది.

అప్పట్లో ఓడిపోయిన బ్రిటిషు సైన్యంలోని భారతీయులను నేతాజీ తన సైన్యంలో చేర్చుకున్నాడు. అయితే 1944 – 45 లో బ్రిటిష్ ఇండియా తో యుద్ధానికి దిగిన జపాన్ ఘోరంగా ఓడిపోయింది. జపాన్ సైన్యం లో సగం మంది చనిపోయారు. జపనీస్ సైన్యానికి సహకారంగా యుద్ధం చేసిన ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులు కూడా చాలా వరకు మరణించారు. దీంతో భారత స్వాతంత్ర పోరాటం కోసం రష్యా సహాయం తీసుకోవాలని నేతాజీ 1945 ఆగస్టు 18న విమానంలో బయల్దేరారు. కానీ ఆ విమానం తైవాన్ లో కూలిపోవడంతో నేతాజీ అక్కడికక్కడే చనిపోయారు అని అప్పటి ప్రభుత్వం పెంచింది. కానీ ఇండియన్ నేషనల్ ఆర్మీ కి చెందిన వారు మాత్రం నేతాజీ ఆ ప్రమాదంలో చనిపోలేదని అంటారు. అయితే నేతాజీకి సంబంధించిన చాలా వరకు సీక్రెట్ పేపర్స్ ను కేంద్ర ప్రభుత్వం దశాబ్దాలపాటు రహస్యంగా వచ్చింది. . కానీ 2015లో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేతాజీకి సంబంధించిన దాదాపు 300కు పైగా సీక్రెట్ పేపర్స్ ను బహిర్గతం చేసింది. ఇందులో నేతాజీ భారత కాంగ్రెస్ నేతలకు సంబంధించిన వివరాలతో పాటు ఆయన మరణానికి సంబంధించిన లెటర్స్ కూడా ఉన్నాయి. అయితే వాటిలో చాలా వరకు పాడైపోయాయి, కొన్ని పూర్తిగా లేవు. ఇంత విలువైన వివరాలు ఉన్న డాక్యుమెంట్ పై నిర్లక్ష్యంగా ఎందుకు ఉన్నారు అని అడిగితే ఎవరి నుంచి ఎటువంటి సమాధానం లేదు. నేతాజీకి సంబంధించిన పేపర్స్ గురించే కాదు నేతాజీ కి సంబంధించి కూడా ఇలాంటి కొన్ని సమాధానం లేని ప్రశ్నలు చాలానే ఉన్నాయి.

1949 అంటే సరిగ్గా దేశానికి స్వాతంత్రం వచ్చిన రెండేళ్ల తర్వాత అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఓ నిర్ణయం తీసుకున్నారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో నేతాజీ, ఇండియన్ నేషనల్ ఆర్మీ పాత్ర ఎంతమేర ఉందో… ఓ పుస్తకం రాయాలని అప్పటి చరిత్రకారుడైన పతుల్ చంద్ర గుప్తని నియమించారు. ఆయన మూడు సంవత్సరాలు కష్టపడి ఒక పుస్తకం రాశారు.

అందులో నేతాజీ గురించి ఆయన స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ గురించి పూర్తి వివరాలు దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క పాత్రను ఆయన వివరిస్తూ 490 పేజీల పుస్తకం రాశారు. కానీ విచిత్రం ఏంటంటే ఈ పుస్తకాన్ని నెహ్రూ కనీసం పబ్లిష్ కూడా చేయించలేదు. దానికి కారణం ఎవ్వరికీ తెలియదు. జవహర్లాల్ నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్ అప్పట్లో రష్యా అంబాసిడర్ గా ఉండేవారు. ఆమె ఒకసారి రష్యా నుంచి భారత్ చేరుకున్నప్పుడు ఓ మీటింగ్ జరిగింది. అందులో ఆమె మాట్లాడుతూ రష్యాలో నేను ఓ గొప్ప వ్యక్తిని కలిశాను.. అతని గురించి తెలిస్తే 1947 ఆగస్టు 15న భారత స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రజలు ఎంతో సంతోషించారో… అంతకంటే ఎక్కువ సంతోషిస్తారు…అని చెబుతూ ఉండగానే పక్కనే ఉన్న నెహ్రు ఆమె మాట్లాడకుండా ఆపేశారట.. కానీ ఆమె ఏం చెప్పబోయారు… ఎవరి గురించి చెప్ప పోయారు అంటే… ఏమో? ఇప్పటికీ తెలీదు

నేతాజీ డెత్ మిస్టరీ గురించి తెలుసుకోవాలని నెహ్రు హయాంలో 1955లో షానవాజ్ కమీషన్ ను ఏర్పాటు చేశారు. అలాగే ఇందిరాగాంధీ టైంలో అంటే 1970లో ఖోస్లా కమిషన్ ను ఏర్పాటు చేశారు. ఈ రెండు కమిషన్ ల ముఖ్య లక్ష్యం ఒకటే.. అది నేతాజీ డెత్ మిస్టరీ బయట పెట్టడం. ఈ రెండు కమిషన్లు బాగా విచారించి 1945లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయారని తేల్చారు. కానీ 1999 లో ఇంకొక విషయం ఏర్పాటైంది అదే ముఖర్జీ కమిషన్. మొదటి రెండు కమిషన్లు భారత్ లో ఉండి విచారణ చేస్తే ఈ కమిషన్ మాత్రం ఏకంగా తైవాన్ కు వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసింది. ఆ తరువాత ఓ షాకింగ్ రిపోర్ట్ ఇచింది. అంతకుముందు రెండు కమిషన్లు ఇచ్చిన రిపోర్టు పూర్తి విరుద్ధంగా నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదని తేల్చింది. అంతేకాదు 1945 aug 18న అసలు ఎలాంటి విమాన ప్రమాదం జరిగినట్లు అప్పటి తైవాన్ ప్రభుత్వ రికార్డుల్లో లేదని తేల్చింది. దీనికి అప్పటి భారత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

ఈరోజుల్లో టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది వెంట్రుకలు చూసి అవి ఎవరివో, ఎక్కడివో చెప్పే టెక్నాలజీ వచ్చేసింది. ఇలాంటి టైంలో సుభాష్ చంద్రబోస్ అస్థికలను ఎందుకు DNA టెస్ట్ చేయట్లేదు. జపాన్ రాజధాని టోక్యోలోని రింకోజి ఆలయంలో ఈ అస్తికలు ఉన్నాయి. అయితే అవి నేతాజీ అస్తికలు కాదని ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికీ చెబుతున్నారు. వాటికి డీఎన్ఏ టెస్ట్ చేయించాలని కోరుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు కనీసం వీటిని భారత్ తీసుకొచ్చే ప్రయత్నం కానీ ఆలోచన కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ చేయడం లేదు.. ఎందుకు అంటే నో ఆన్సర్…

అది 1945లోనే చనిపోతే 1967 వరకు అంటే నెహ్రు నుంచి ఇందిరా గాంధీ ప్రభుత్వం వరకు ఢిల్లీలోని నేతాజీ కుటుంబం పైన సీక్రెట్ గా నిఘా పెట్టారు అలాగే ఆయన 1945 లోనే చనిపోయాడు అని తెలిస్తే ఆయన డెత్ సర్టిఫికెట్ ఎందుకు లేదు… ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇప్పటికీ లేదు.

అప్పట్లో నేతాజీకి అత్యంత సన్నిహితుడైన ఇండియన్ నేషనల్ ఆర్మీ సోల్జర్ నిజాముద్దీన్ అప్పట్లో నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదని , ఆ ప్రమాదం జరిగిన మూడు నెలల తర్వాత థాయిలాండ్ – మైన్మార్ సమీపంలోని ఒక నది ఒడ్డున తానే స్వయంగా వదిలిపెట్టనని నిజాముద్దీన్ చెప్పారు. కానీ విచిత్రం ఏంటంటే నేతాజీ డెత్ మిస్టరీ తేల్చడానికి ఏర్పాటు చేసిన మూడు కమిషన్ లలో కనీసం ఒక్కటి కూడా నిజాముద్దీన్ ను ప్రశ్నించడం అటుంచితే కనీసం కలువను కూడా కలవలేదు. ఎందుకని నిజాముద్దీన్ అంత ఇంపార్టెంట్ కాదు అనుకున్నారో ఇప్పటికీ తెలీదు. నిజాముద్దీన్ చెప్పినట్లే ఇండియన్ నేషనల్ ఆర్మీ లోని అనేక మంది సైనికులు నేతాజీ విమాన ప్రమాదంలో మరణించారు ఒప్పుకోరు.

నేతాజీ ఆ విమాన ప్రమాదం నుంచి తప్పించుకొని రహస్యంగా భారత్ చేరుకున్నారు అంటారు కొంతమంది

గుమ్నామీ బాబాగా ఉత్తరప్రదేశ్ లో రహస్యంగా నివసించేవారని చెబుతారు. గుమ్నామీ బాబా 1985 సెప్టెంబర్ 16న మరణించారు ఆయనే నేతాజీ నా కాదా అనే విషయంలో కోర్టులు కూడా జోక్యం చేసుకున్న, పోలీసులు దర్యాప్తు చేసినా, అధికారికంగా ఆయనే నేతాజీ అనడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదు. అలాగే కొంతమంది చాలా ఏళ్ళపాటు ఆయన రస్యలొనే చాలా ఏళ్ళ పాటు ఉన్నారని అక్కడి నుంచి అనేక అంతర్జాతీయ కార్యక్రమాల్లో పాల్గొనారని, లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ ఒప్పందం సమయంలో నేతాజీ అక్కడే ఉన్నారని అన్నారు.

ఏది ఏమైనా నేతాజీ లాంటి గొప్ప దేశభక్తుడు దేశం కోసం తన సర్వస్వాన్ని ధారపోసిన త్యాగమూర్తి పేరుకు సామాన్యుడైనా… భారత స్వాతంత్ర సాధన కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రపంచ శక్తులను ఏకం చేసిన ఆసామాన్యుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్… ఎటు వెళ్లారో.. ఏమయ్యారో… ఎలా చనిపోయారో… ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీ..జైహింద్.

Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!