అమెరికా కు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అమెరికా జెండా నక్షత్రాలు కథ ఏంటి

అమెరికా ఇప్పుడు అగ్రరాజ్యంగా ప్రపంచాన్ని శాసిస్తోంది. అయితే ఇంత పెద్ద దేశం కూడా ఒకప్పుడు తెల్లదొరల చేతిలో అణచివేత కు గురైంది. బ్రిటిష్ ఆధిపత్యాన్ని ఎదిరించి బానిస సంకెళ్లను తెంచుకుని అమెరికాలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా కృషి చేశారు నాటి ఆ దేశ స్వాతంత్ర సమరయోధులు. 1776 జూలై 2వ తేదీన 13 కాలనీలు ఇకపై బ్రిటిషర్ల ఆధీనంలో ఉండవని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లో భాగమని స్వాతంత్ర ఉద్యమ నేతలు తీర్మానించారు. జులై 4 వ తేదీన స్వాతంత్ర దినోత్సవం ప్రకటించారు.

ఇంతకీ ఆ పదమూడు కాలనీలు ఏంటి? అమెరికా జాతీయ జెండా ప్రత్యేకత ఏంటి? ఈ రోజు తెలుసుకుందాం.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

అమెరికా తూర్పు తీరంలోని 13 ప్రాంతాలను బ్రిటిషర్లు పాలించేవారు. న్యూ హాంషేర్, మ్యాస చ్యుసెట్స్, కనెక్టి కట్, రోడ్ ఐలాండ్, న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, మేరీల్యాండ్, డెల్ వేర్, వర్జీనియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, జార్జియా అనే ఈ ప్రాంతాలు బ్రిటిషు వారి ఆధీనంలో ఉండేవి. వీటిని కాలనీ లుగా పిలిచేవారు. అయితే బ్రిటీషర్ల నుంచి తీవ్రంగా అణిచివేత మొదలవడంతో 1760 లో నుంచి స్థానికులు తిరుగుబాటు మొదలైంది. అది క్రమక్రమంగా పెరుగుతూ యుద్ధం దాక వెళ్ళింది. 1783 సెప్టెంబర్ 3 వరకు కొనసాగిన ఈ యుద్ధం టైంలోనే అమెరికన్లు స్వతంత్రత ప్రకటించుకున్నారు.

జార్జ్ వాషింగ్టన్ నేతృత్వంలో తిరుగుబాటుదారులు బ్రిటిషు సైన్యాన్ని ఎదుర్కొన్నారు. అమెరికాకు స్పెయిన్ , ఫ్రాన్స్ రాజ్యాలు అండగా నిలిచాయి. అమెరికన్ల ధాటికి తట్టుకోలేక చివరకు 1783లో బ్రిటీషర్లు అమెరికా స్వతంత్రతను గుర్తించారు. అలా ఆ 13 కాలనీలు బ్రిటీషర్ల నుంచి విముక్తి పొంది United States Of America లో భాగమయ్యాయి.

ఇక మనం ఇప్పుడు చూస్తున్న అమెరికా అంటే టెక్సాస్, క్యాలిఫోర్నియా మొదలైన రాష్ట్రాలు తర్వాత కాలంలో ఈ యుఎస్ఏ లో భాగమయ్యాయి. ఉదాహరణకు టెక్సాస్ ఒకప్పుడు మెక్సికో లో భాగంగా ఉండేది. స్పెయిన్ నుంచి మెక్సికన్లు స్వాతంత్రం పొందాక 1835 లో రిపబ్లిక్ ఆ టెక్సాస్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. అయితే 1845 లో ఆ రాష్ట్రం యునైటెడ్ స్టేట్స్ లో విలీనం అయ్యేందుకు అంగీకరించింది. మరోవైపు క్యాలిఫోర్నియా కూడా అదే తరహాలో 1850లో అమెరికాలో భాగమైంది. ఇలా ఇతర రాష్ట్రాలు కూడా క్రమంగా యుఎస్ లో విలీనమయ్యాయి.

అందుకే అమెరికా జాతీయ జెండాలో 13 కాలనీలకు గుర్తుగా ఎరుపు తెలుపు రంగులు , 50 రాష్ట్రాలకు గుర్తుగా 50 నక్షత్రాలు ఉంటాయి. ఏటా అమెరికన్లు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. బాణసంచా కాలుస్తూ ఆటపాటలతో సరదాగా గడుపుతారట. ఏటా ఈ రోజున కేవలం బాణసంచా కోసం అమెరికా ఎంత ఖర్చు పెడుతుందో తెలుసా…దాదాపు ఒక బిలియన్ డాలర్లు.. ఇది అమెరికా స్వాతంత్ర్య మరియు అమెరికా జెండా వెనక ఉన్న కథ.

Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!